Kuppam : లోకేష్ ను ఆకాశానికెత్తిన సీనియర్లు, చంద్రబాబు మైండ్ సెట్ పై చురకలు
తొలి రోజు జరిగిన (Kuppam) బహిరంగ సభలో చంద్రబాబు మాదిరిగా కార్యకర్తలను
- Author : CS Rao
Date : 27-01-2023 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
అధికారంలో ఉన్నప్పుడు పోటీపడి కాబోయే సీఎంగా లోకేష్ అంటూ చెప్పిన సీనియర్లు ఇప్పుడు మరోరకంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కుప్పం వేదికగా తొలి రోజు జరిగిన (Kuppam) బహిరంగ సభలో చంద్రబాబు మాదిరిగా కార్యకర్తలను ఇబ్బంది పట్టేలా లోకేష్ వ్యవహారం ఉండదని తేల్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు మరోలా కార్యకర్తల విషయంలో చంద్రబాబు(CBN) ఉండడం కారణంగా అందర్నీ ఇబ్బంది పెట్టారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
తొలి రోజు జరిగిన బహిరంగ సభ(Kuppam)
టీడీపీ అధినేత చంద్రబాబును(Kuppam) సుతిమెత్తగా చురకలు అంటించి, లోకేశ్ పై పొగడ్తల జల్లు కురిపించారు. “చంద్రబాబు చాలా మంచివారు. చంద్రబాబు బాధపడినా ఉన్న నిజాలివంటూ ఆయనపై అచ్చెంనాయుడు చురకలు వేశారు. కానీ, లోకేష్ మాత్రం చంద్రబాబు లాంటి వాడు కాదని, ఈ మూడున్నరేళ్లుగా టీడీపీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసినవాళ్లను తాటతీసి, కార్యకర్తలకు న్యాయం చేస్తాడు” అంటూ అచ్చెంనాయుడు(CBN) ప్రసంగించడం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలీసుల గురించి మాట్లాడుతూ రాయడానికి వీల్లేని భాషలో అచ్చెన్న ఓ బూతు ప్రయోగం చేశారు. లోకేశ్ పాదయాత్ర కోసం జనం తండోపతండాలుగా వస్తే ఒక్క పోలీసోడు కూడా సహకరించలేదని ఆరోపించారు. తమ పార్టీ యాత్రకు తామే పోలీసులమని, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
Also Read : Yuvagalam Security : లోకేశ్ రక్షణకు మూడంచెల భద్రత, ప్రైవేటు సైన్యం
అంతకుముందు, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, యువగళంతో టీడీపీ దళం, స్వరం మారుతోందని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎవరు ఇబ్బందిపెట్టినా ప్రజల కోసం ఓర్చుకోవాలని లోకేశ్ ను కోరుతున్నానని తెలిపారు. ప్రజల సమస్యలు వింటూ, ప్రజల్లోంచి వచ్చే సూచనలు పాటించాలని లోకేశ్ కు సూచిస్తున్నానని పయ్యావుల వివరించారు. తాతయ్య తెగువ, నాన్న నాయకత్వంలో లోకేశ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.మూడున్నర సంవత్సరాలుగా ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ మూర్ఖుడు ఎప్పుడు మనమీద పడతాడోనని ఈ మూడున్నరేళ్లుగా నిద్రలేకుండా గడిపామని, ఇప్పుడీ మూర్ఖుడికి సరైన మొగుడు, మన యువ నాయకుడు లోకేశ్ వచ్చారని స్పష్టం చేశారు. లోకేశ్ వారసత్వంతో రావడంలేదని, రాష్ట్ర భవిష్యత్ ను తిరగరాయాలని నాయకుడిగా వస్తున్నాడని ఉద్ఘాటించారు.
సైకో జగన్ ఒకవైపు
గతంలో లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశారని, రాష్ట్రంలో సీఎం జగన్ నియోజకవర్గం సహా 175 నియోజకవర్గాల్లో 20 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు, తారు రోడ్లు వేశారంటే అందుకు లోకేశ్ కారణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాత్రుళ్లు వీధి లైట్లుగా ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయంటే అందుకు కారణం లోకేశ్ అని అన్నారు. ఏపీ ప్రజలు గుక్కెడు నీళ్లు తాగుతున్నారంటే లోకేశ్ పంచాయతీ శాఖ మంత్రిగా అందించిన సమర్థ పాలన వల్లేనని స్పష్టం చేశారు.అలాంటి లోకేశ్ కు అవినీతి అంటించేందుకు జగన్ ప్రయత్నించాడని, తాను అవినీతికి పాల్పడినట్టు భావిస్తే నిరూపించుకో అని సవాల్ విసిరిన నాయకుడు లోకేశ్ అని అచ్చెన్న కొనియాడారు. జగన్ ఆ విధంగా సవాల్ చేయగలడా? అని ప్రశ్నించారు. సైకో జగన్ ఒకవైపు, ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు పోరాడుతున్నారని వెల్లడించారు. మొత్తం మీద సీనియర్లు అందరూ లోకేష్ కు జై కొడుతూ పోటీపడి ప్రశసించారు.
Also Read : Yuvagalam : అల్లుడికి ప్రేమతో…బాలయ్య, కోలాహలం నడుమ లోకేష్ తొలి అడుగు