HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telugu Desam Party Behind Janasena Avirbhava Sabha

Janasena Avirbhava Sabha : పొలిటిక‌ల్ చౌర‌స్తాలో జ‌న‌సేనాని

రాజ‌కీయాల్లో ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు వాళ్ల‌వే. రాజ్యాధికారం దిశగా ఎలాంటి అవకాశాన్నైనా ఏ పార్టీ వ‌దులుకోదు.

  • Author : CS Rao Date : 14-03-2022 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

రాజ‌కీయాల్లో ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు వాళ్ల‌వే. రాజ్యాధికారం దిశగా ఎలాంటి అవకాశాన్నైనా ఏ పార్టీ వ‌దులుకోదు. అందుకోసం ఎన్ని మెట్లు దిగ‌డానికైనా స‌మ‌కాలీన రాజ‌కీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ప‌రిస్థితి టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య క‌నిపిస్తోంది. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌ను ఈసారి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఆ వేదిక‌పై నుంచి ప‌వన్ క‌ల్యాణ్ దిశానిర్దేశం చేస్తాడ‌ని అభిమానుల చూపుతోన్న ఆస‌క్తి. ఆ స‌భ‌ను సూప‌ర్ హిట్ చేయ‌డానికి పొత్త‌ను కోరుకుంటోన్న టీడీపీ తెర‌వెనుక అండ‌గా నిలుస్తోంది.ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన కు ద‌గ్గ‌ర కావ‌డానికి ప‌లు ప్ర‌యత్నాలు చేస్తోంది. ఆ పార్టీ తొంద‌ర‌పాటును రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి జ‌న‌సేనాని ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తుతో ఉన్నాయి. కానీ, ఆ రెండు పార్టీ మ‌ధ్య భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఏ రోజైన క‌టీఫ్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత జ‌న‌సేన త‌న పంథాను మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. అవ‌మానాలు భరించైనా బీజేపీతో పొత్తును కొన‌సాగించ‌డానికి జ‌న‌సేనాని సిద్ధం అయిన‌ట్టు సమాచారం. ఆ విష‌యాన్ని సోమ‌వారం జ‌రిగే ఆవిర్భావ సభ‌లో వెల్ల‌డిస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ చేసే ప్ర‌సంగం ఎలా ఉండబోతుందో..తెలియ‌చేసేలా ఆదివారం ఒక వీడియోను ట్రైల‌ర్ రూపంలో జ‌న‌సేనాని విడుద‌ల చేశాడు. దాని ఆధారంగా గ‌త రెండేళ్లుగా జ‌గ‌న్ స‌ర్కార్ చేసిన ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను ఎత్తిచూప‌బోతున్నాడని అర్థమ‌వుతోంది. వ్యక్తిగ‌తంగా త‌న‌పై చేసిన కామెంట్ల‌కు కూడా ఈ వేదిక‌పై నుంచి ప‌వ‌న్ రిప్లై ఇవ్వ‌బోతున్నాడు. సిద్ధాంత ప‌రంగానూ, విధాన‌ప‌రంగానూ ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేద‌ని ఆయ‌న విడుద‌ల చేసిన ట్రైల‌ర్ వీడియో ఆధారంగా విశ్లేషించుకోవ‌చ్చు. తొమ్మిదో ఏట అడుగుపెట్టిన జ‌న‌సేన సిద్ధాంత ప‌రంగా ఏదైనా క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుంద‌ని ఆ పార్టీ అభిమానులు భావిస్తున్నారు. గత రెండున్నరేళ్లలో ఏమేం జరిగాయి? ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం? అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని పవన్ కల్యాణ్ ట్రైల‌ర్ వీడియోలో స్ప‌ష్టం చేశాడు. విచిత్రంగా ఈసారి దామోద‌ర సంజీవ‌య్య భావ‌జాలాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్ చెప్పేందుకు సిద్ధం అయ్యాడు.

ఎనిమిదేళ్ల క్రితం జ‌న‌సేన ఆవిర్భావం రోజున చేగువీరా , చాక‌లి ఐల‌మ్మ భావ‌జాలాన్ని బ‌లంగా ప‌వ‌న్ వినిపించాడు. ప్ర‌శ్నించే త‌త్త్వాన్ని అల‌వాటు చేయ‌డ‌మే జ‌న‌సేన సిద్ధాంత‌మ‌ని దిశానిర్దేశం చేశాడు. అదే స్లోగ‌న్ తో 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు పార్టీ న‌డిపాడు. ఆ ఎన్నిక‌ల్లో కాన్షీరాం భావ‌జాలాన్ని జోడించాడు. చేగువీరా, ఐల‌మ్మ‌, కాన్షీరాం భావ‌జాలాన్ని మిక్స్ చేసి కులాల‌ను క‌లిపే మ‌తాల ప్ర‌స్తావ‌న లేని సిద్ధాంతం అంటూ 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లాడు. క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ ల‌తో క‌లిసి కూట‌మిగా పోటీ చేయ‌గా ఆయ‌న రెండు చోట్లా ఓడిపోయాడు. జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థులు చాలా మంది డిపాజిట్లు గ‌ల్లంతు అయ్యాయి. ఒకేఒక ఎమ్మెల్యే రాపాక వ‌ర ప్ర‌సాద్ గెలిచాడు. ఆయ‌న కూడా ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. 2019 ఎన్నిక‌ల త‌రువాత అక‌స్మాత్తుగా బీజేపీతో ప‌వ‌న్ జ‌త క‌ట్టాడు. దీంతో పార్టీ సిద్ధాంత‌క‌ర్త‌లుగా ఉన్న కొంద‌రు జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పారు. పార్టీని విలీనం చేయాల‌ని ఢిల్లీలోని ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని ప‌వ‌న్ ఇచ్చిన సంకేతం ఆనాడు క‌ల‌క‌లం రేపింది.ప్ర‌జారాజ్యం పార్టీకి యువ‌రాజ్యం అధ్యక్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ప‌వ‌న్ కు ఉంది. ఆ అనుభవంతోనే జ‌న‌సేన పార్టీని స్థాపించాడు. 25ఏళ్ల పోరాటాన్ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. రాజ్యాధికారం కోసం కాదంటూ తొలి రోజుల్లో చెప్పిన జ‌న‌సేనాని ఇప్పుడు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతున్నాడు. ప‌ల్ల‌కీలు మోసే బోయీలుగా ఎల్ల‌కాలం ఉండ‌లేమ‌ని ప‌లు వేదిక‌ల‌పై చెప్పాడు. రాజ్యాధికారం దిశ‌గా బ‌లంగా అడుగులు వేస్తోన్న ఆయ‌న‌కు టీడీపీ అండ దొరికింది. ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ ప‌వ‌న్ కల్యాణ్ మ‌ద్ధ‌తు కోసం అర్రులా చాస్తోంది. ఇలాంటి ప‌రిణామాన్ని రాజ్యాధికారం దిశ‌గా మ‌లుచుకోవాల‌ని జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

Janasena Sabha

Janasena Sabha

2019 ఎన్నిక‌ల్లో బీఎస్పీ, వామ‌ప‌క్షాల‌తో కూట‌మి క‌ట్టిన జ‌న‌సేన ఈసారి పంథాను మార్చ‌నుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. నోటా కంటే త‌క్కువ ఓట్లు ఉన్న బీజేపీని ఏపీలో నైస్ గా వ‌ద‌లించుకోవాల‌ని చూస్తోంద‌ని వినికిడి. ఇప్ప‌టికే చెరోదారిలాగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరును చూస్తుంటే, రెండు పార్టీల మ‌ధ్య పొస‌గ‌డంలేద‌ని అర్థం అవుతోంది. ఆ క్ర‌మంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం ఊపందుకుంది. కానీ, టీడీపీతో పొత్తు రాజ్యాధికారం ఇవ్వ‌ద‌ని జ‌న‌సైనికుల అభిప్రాయం. టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో అధికారంలోకి వచ్చిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు సీఎం అవుతాడ‌ని జ‌న‌సేన‌కు తెలుసు. అందుకే, ఇప్పుడు మ‌రో ప్ర‌త్యామ్న‌యం దిశ‌గా ఆలోచిస్తుంద‌ని టాక్‌. ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజ్యాధికారం సాధ్య‌మ‌నే ధోర‌ణి ఇప్పుడు జ‌న‌సేన‌లో క‌నిపిస్తోంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ తొమ్మిదో ఆవిర్భావ స‌భ వేదిక పై నుంచి ప‌వ‌న్ ఇచ్చే స్పీచ్ ఎలాంటి దిశానిర్దేశం చేయ‌నుందో..చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • janasena avirbhava sabha
  • pawan kalyan public meeting
  • TDP chandrababu naidu
  • telugu desam party

Related News

CM Chandrababu: Good news for AP students – 4% interest subsidy on education loans.

CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రుణాలపై వడ్డీలో నాలుగు శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉన్

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • MLA Chintamaneni Prabhakar goes on a rampage.

    TDP ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd