HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telugu Desam Party 40th Spring Celebrations

TDP: టీడీపీ 40 వ‌సంతాల వేడుక‌లు… వాడ‌వాడ‌లా ఆవిర్భావ వేడుక‌ల‌కు స‌న్నాహాలు

  • Author : HashtagU Desk Date : 26-03-2022 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
45
45

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ వాడవాడల్లో ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించేందుకు అధిష్టానం స‌న్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా తయారు చేసిన నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో లోగో ఆవిష్కరణ జరిగింది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందని చంద్రబాబు గుర్తు చేశారు. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు తెలుగు దేశం పాలనలో అందాయని తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని చంద్రబాబు తెలిపారు.

బిసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే అని….అనేక సామాజిక మార్పులకు టిడిపి ఆవిర్భావం కారణం అయ్యిందని చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగు దేశమే అని…..జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ రోజున గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండాఆవిష్కరణలు చేపట్టాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు ఉండాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో నాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రాంతాన్నిసందర్శిస్తామని…అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారని చంద్రబాబు తెలిపారు.

కల్తీ మద్యం వల్ల అంతమంది చనిపోతే కనీసం చర్చ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుందని… కొన్ని బ్రాండ్ల మద్యం ఎపిలో కన్పించకుండా పోవడడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. కిళ్లీ కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఎందుకు ఉండవని అన్నారు. మద్యం విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్లేది లేదని… కల్తీ సారా వల్ల 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా అని మండిపడ్డారు. మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు…దీనిపై ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 15,600 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని….ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయ్యిందని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులిస్తామని నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారని అన్నారు. పోలవరం విషయంలో సీఎం జగన్ నంగి నంగి మాట్లాడుతున్నారని…వాస్తవాలు చెప్పాలని అన్నారు. మిగిలిపోయిన కాఫర్ డ్యాం పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే.. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేదే కాదని అన్నారు. తప్పులు అన్నీ జగన్ చేసి…ఇప్పుడు టిడిపిపై తోస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన దరిద్రపు పనికే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మండిపడ్డారు. పోలవరం- అమరావతి ఏపీకి రెండు కళ్లు అయితే….ఆ రెండు కళ్లను సీఎం జగన్ పొడిచేశారని చంద్రబాబు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • tdp

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd