Divyavani Steps Back : దివ్యవాణి `రాజీనామా ట్వీట్` తూచ్
రాజీనామా చేసిన టీడీపీ అనధికార అధికార ప్రతినిధి దివ్యవాణి ఒకడుగు వెనక్కు వేశారు.
- By CS Rao Published Date - 03:43 PM, Tue - 31 May 22

రాజీనామా చేసిన టీడీపీ అనధికార అధికార ప్రతినిధి దివ్యవాణి ఒకడుగు వెనక్కు వేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని మీద ఎలాంటి వ్యతిరేకత లేదని ట్వీట్ చేసిన ఆమె నిమిషాల వ్యవధిలోనే తొలిగించారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ చీఫ్ బచ్చుల అర్జునుడు చేసిన మధ్యవర్తిత్వం ఆమెను తాత్కాలికంగా ఆపింది. మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా రాజీనామా ఎపిసోడ్ తదనంతరం పరిణామాలను వివరించడానికి దివ్యవాణి సిద్ధం అయ్యారు. దుష్ట శక్తి గురించి ఆమె ఏమి చెబుతుందో మీడియా ఎదురుచూస్తోంది.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఉదయం ట్వీట్ చేసిన సినీ నటి దివ్యవాణి నిమిషాల వ్యవధిలోనే తొలగించేశారు. అంతేకాకుండా, టీడీపీని వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుండి ఆమె మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు దివ్యవాణితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అనంతరం ఆమె పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
మహానాడు వేదికగా జరిగిన అవమానాన్ని ఆమె బచ్చుల అర్జునుడికి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో తగినంత గుర్తింపు లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. నిజాయితీగా పనిచేసినప్పటికీ సరైన విలువ ఇవ్వడంలేదని దివ్యవాణి అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం దివ్యవాణి ఇష్యూని సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం బచ్చుల అర్జునుడు మాత్రమే ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. దుష్టశక్తి కారణంగా పార్టీలో నష్టపోతున్నానని ఆమె అభిప్రాయపడుతున్నారు. మీడియా ఎదుట ఆమె ఎలాంటి విషయాలు బయటపెడతారోనని ఆమె అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.