Pithapuram : నాగబాబు కు టీడీపీ నేతలు కౌంటర్
Pithapuram : పిఠాపురంలో పవన్ గెలుపు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని, వేరే ఎటువంటి సహకారం లేదని నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ నేతల్లో అసహనం రేపింది.
- By Sudheer Published Date - 05:01 PM, Fri - 30 May 25

2024 ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram ) నియోజకవర్గం హాట్ స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడం, అనంతరం డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విజయంలో టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (Varma) కీలక పాత్ర పోషించారని పలు వర్గాలు చెబుతున్నాయి. తన సీటును పవన్ కోసం త్యాగం చేయడం వల్లే ఇది సాధ్యమైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే సమయంలో జనసేన తరఫున పిఠాపురాన్ని ‘అడ్డా’గా మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ASCI : 2024-25 సంవత్సరానికి ASCI వార్షిక నివేదిక విడుదల..డిజిటల్ ప్రకటనలపై ప్రభావవంతమైన చర్యలు
ఇటీవల నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య వేడిని పెంచినట్టు అయ్యాయి. పిఠాపురంలో పవన్ గెలుపు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని, వేరే ఎటువంటి సహకారం లేదని నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ నేతల్లో అసహనం రేపింది. ఈ వ్యాఖ్యలపై అధినాయకత్వం స్పందించినప్పటికీ, గ్రామ స్థాయిలో మాత్రం తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. పిఠాపురంలో టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉంటూనే పటిష్టంగా తమ బలం చూపిస్తున్నారు.
Janasena : సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్..ఎందుకంటే !!
తాజాగా కడప మహానాడులో పాల్గొన్న పిఠాపురం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురంలో అసలైన బలం టీడీపీకే ఉందని స్పష్టం చేశారు. వర్మ గత 25 ఏళ్లుగా ప్రజలతో సన్నిహితంగా ఉండి పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. జనసేనకు 20 శాతం బలం ఉంటే, మిగిలిన 80 శాతం తమదే అని చెప్పడమే కాకుండా, పవన్ విజయం తమ ఆధారంగానే సాధ్యమైందని గట్టిగా ప్రకటించారు. దీంతో, పిఠాపురంలో ‘జనసేన అడ్డా’ నినాదానికి టీడీపీ నేతలు స్పష్టమైన కౌంటర్ ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పిఠాపురం అంటే వర్మ గారి అడ్డా
వర్మ గారు లేకపోతే 20% వోట్ కూడా వచ్చేది కాదు 🤣🤣🤣 pic.twitter.com/LBdoYQqlcl
— Swathi Chowdary (@swathi_ysj) May 28, 2025