Tahsildar Suicide: అల్లూరి జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య!
అల్లూరి సీతారామరాజులో జిల్లాలో ఓ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
- Author : Balu J
Date : 08-12-2022 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
పని ఒత్తిడి, సిబ్బంది లేమీ కారణంగా తహసీల్దార్లపై మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఫలితంగా ఒక్కొసారి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra pradesh) అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Sitharama Raju district) గురువారం తహసీల్దార్ (Tahsildar) కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు తహసీల్దార్ ఉదయం కార్యాలయానికి వచ్చారు. అనంతరం టిఫిన్ తీసుకురావాలని అటెండర్‌ను కోరగా, అటెండర్ తిరిగి వచ్చేసరికి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పాడేరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులు శ్రీనివాసరావును నిలదీయడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. డివిజన్‌లో భూ సర్వే పనులు నత్తనడకన సాగడంపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారని, అప్పటి నుంచి తహసీల్దార్ డిప్రెషన్‌లో ఉన్నారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Telangana Congress: ప్రక్షాళనలో టీకాంగ్రెస్.. ఠాగూర్ ఔట్, రేవంత్ దూకుడుకు చెక్!