Chintalapudi TDP Incharge : చింతలపూడి టీడీపీ ఇన్ ఛార్జ్ గా రోషన్ కుమార్
- By Sudheer Published Date - 02:53 PM, Wed - 21 February 24

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు నియోజవర్గాల తాలూకా ఇంచార్జ్ (Incharge) లను నియమించేపనిలో పడ్డాయి. కొన్ని చోట్ల మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడిపి (TDP) అధిష్టానం.. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ (Chintalapudi TDP Incharge) గా సాంగా రోషన్ కుమార్ (Songa Roshan Kumar) ను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జ్ గా కంభం విజయరాజు ఉన్నారు. కాగా నిన్న నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ గా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని నియమించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సాంగా రోషన్ కుమార్ కుమార్ ను నియమించారు బాబు.
We’re now on WhatsApp. Click to Join.
చింతలపూడి నియోజకవర్గంలో అక్కడ ఇంఛార్జ్ లేకపోవడంతో కేడర్ గందరగోళంలో ఉంది. ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. సొంగా రోషన్‌తో పాటుగా అనిల్ బొమ్మాజి, ఆకుమర్తి రామారావు, మాజీ మంత్ర పీతల సుజాత పేర్లు వినిపించాయి. అయితే అనిల్, రోషన్‌లలో ఒకిరికి టికెట్ ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరిగింది. అలాగే ఇద్దరు నేతలు కలిసి ఎవరికి టికెట్ దక్కినా గెలుపు కోసం పనిచేయాలని చర్చించుకున్నారు. చివరికి ఎన్నారై రోషన్ కుమార్‌కు చింతలపూడి టికెట్ దక్కింది.
మరోపక్క రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రికలపై జరుగుతున్న దాడులను చంద్రబాబు తీవ్రంగా ఖండిస్తూ.. వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు హయాంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘జగన్‌రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, ప్రతిపక్షాల నుంచి పత్రికాధినేతలపై, పార్టీ కార్యకర్తలపై దాడికి పురికొల్పుతున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని బాబు తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఆంధ్రజ్యోతి, టీవీ5, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్‌పై దారుణంగా దాడి చేసి తీవ్ర గాయపర్చడం అనాగరికమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read Also : Nikhil : తండ్రైన హీరో నిఖిల్..