HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >September 1st Very Special Day In Chandrababu

Chandrababu September 1st : రేపు చంద్రబాబుకు ఎంతో ప్రత్యేకం ..

1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది

  • Author : Sudheer Date : 31-08-2024 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
September 1st Very Special
September 1st Very Special

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు రేపు (సెప్టెంబర్ 1) ఎంతో ప్రత్యేకం. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు ఆయన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆనాడు జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజలను కూడా పాలనలో భాగస్వాములను చేశారు. ఒక పనిని సాధించాలంటే విజన్‌తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం. అలాగే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. అదే చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ‘విజన్-2020’. అప్పట్లో వెక్కిరించిన వారు.. ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను ఆంధ్ర ప్రదేశ్ కు రప్పించి గ్లోబల్ ఐటీ రంగాన్ని రాష్ట్రంపై దృష్టి సారించేలా చేయడం వల్ల లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు ఇంజినీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగిందంటే దానికి తొలిమెట్టు వేసింది చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి బాబు ఏపీలో జరిగిన ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి సీఎంగా, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి, చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఆయన నైజం. ఇక సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే తన మార్క్ కనపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నింపుతూ..ఈరోజు టాప్ 5 సీఎం లలో ఒకరిగా గుర్తింపు సాధించారు.

సాధారణంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు లేకుంటే పెళ్లి రోజు అంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఫలానా రోజున తనకు కలిసివచ్చిన రోజు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది. అందుకే టీడీపీ శ్రేణులు 30 సంవత్సరాల వేడుకలు జరిపేందుకు సిద్ధం అవుతున్నారు.

Read Also : Putin : మంగోలియాకు పుతిన్.. అరెస్టు చేసి ఐసీసీకి అప్పగిస్తారా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • september 1st
  • special day
  • TDP to celebrate Naidu reaching 30-year

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Jagan Amaravati

    Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

Latest News

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

  • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd