HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Security Lapse At Jagans House

Jagan : మరోసారి జగన్ ఇంటివద్ద భద్రత లోపం..ఈసారి ఏంజరిగిందంటే !!

Jagan : జగన్ ఇంటి వద్ద జరుగుతున్న సంఘటనలపై వైఎస్సార్సీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నదేమంటే, ఇలా వరుస ఘటనలు జరుగుతుండటమే కాకుండా, అవి సాంకేతిక ఆధారాలు ఉండీ భద్రతా వ్యవస్థ స్పందించకపోవడం

  • Author : Sudheer Date : 22-06-2025 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan House
Jagan House

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) తాడేపల్లి నివాసం వద్ద మరోసారి భద్రతా లోపం (Security flaw) వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు నలుపురంగు కారులో వచ్చి ఆయన ఇంటి ముందు ఒక వస్తువును విసిరి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం 4:32 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఇది ఇటీవల కాలంలో జగన్ ఇంటి వద్ద జరుగుతున్న నాల్గవ భద్రతా లోపం కావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Iran-israel : ఇరాన్ ప్రెసిడెంట్ కు ప్రధాని మోదీ ఫోన్

ఇంతకు ముందు కూడా జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం, బీజేపీ యువమోర్చా నేతల దాడి, టీడీపీ కార్యకర్తల హల్‌చల్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో శ్రీలక్ష్మీ నారాయణ కాలనీలో జగన్ నివాసానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో మంటలు చెలరేగగా, సెక్యూరిటీ సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే, బీజేవైఎం నేతలు శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో జగన్‌ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్దకు వచ్చి గేటు దగ్గర హంగామా చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

జగన్ ఇంటి వద్ద జరుగుతున్న సంఘటనలపై వైఎస్సార్సీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నదేమంటే, ఇలా వరుస ఘటనలు జరుగుతుండటమే కాకుండా, అవి సాంకేతిక ఆధారాలు ఉండీ భద్రతా వ్యవస్థ స్పందించకపోవడం శోచనీయమని భావిస్తున్నారు. ప్రభుత్వం మారిన తరువాత రాజకీయ ప్రతీకారమేనన్న ఆరోపణలు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత అయిన జగన్‌కి పక్కా భద్రత లభించాల్సిన తరుణంలో ఇలా పదే పదే భద్రతా లోపాలు వెలుగుచూడటం దురదృష్టకరమని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార యంత్రాంగం ఈ విషయాన్ని తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • jagan house tadepalli
  • security problem jagan house

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd