Mahanadu 2025 : టీడీపీ విజయం వెనుక రహస్యం ఇదే..!!
Mahanadu 2025 : నందమూరి తారకరామారావు (NTR) స్థాపించిన ఈ పార్టీ మహానాడు ద్వారా తన ఆధారాన్ని ప్రజల మధ్య తిరిగి చాటుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది
- By Sudheer Published Date - 11:38 AM, Tue - 27 May 25

తెలుగుదేశం పార్టీకి మహానాడు (Mahanadu ) ఒక రాజకీయ కంచుకోటగా నిలిచింది. పార్టీ స్థాపననుండి ప్రతి మైలురాయికి ఈ మహానాడు కీలకంగా మారింది. ఈసారి కడపలో జరుగుతున్న మహానాడు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఇది టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక తొలి మహానాడు మాత్రమే కాకుండా, వైఎస్ జగన్ స్వగృహంగా భావించే ప్రాంతంలో జరుగుతోంది. మే 27 నుంచి మూడు రోజుల పాటు ఈ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. నందమూరి తారకరామారావు (NTR) స్థాపించిన ఈ పార్టీ మహానాడు ద్వారా తన ఆధారాన్ని ప్రజల మధ్య తిరిగి చాటుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతీ మహానాడు టీడీపీకి ఒక కొత్త శక్తిని ఇచ్చినదిగా చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు 2022లో ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు వల్ల పార్టీ నేతలు తిరిగి ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అదే 2023లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు ఎన్నికల ప్రణాళికలకు మౌలికంగా నిలిచింది. సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలను ప్రకటించిన వేదికగా చరిత్రలో నిలిచింది. ఈ మహానాడ్ల ఫలితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించి, చంద్రబాబు నాయుడు (Chandrababu ) మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
Terror Links Case: విజయనగరంలో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్
ఈ సంవత్సరం మహానాడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. కడపలో మహానాడు నిర్వహించడం ఒక వైపు ప్రతిపక్షానికి సవాల్ కాగా, మరోవైపు పార్టీ కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నింపే దిశగా సాగుతుంది. మూడురోజుల పాటు ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరిపి, చివర రోజు మే 29న దాదాపు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. నిజంగా చెప్పాలంటే, టీడీపీ విజయానికి మూడున్నర దశాబ్దాలుగా దోహదపడుతున్న ‘మహానాడు’ ఒక టాప్ సీక్రెట్ అనే చెప్పవచ్చు. ఇది పార్టీకి కొత్త ఊపిరిని, నేతలకు రాజకీయ స్పష్టతను అందించే వేదికగా నిలుస్తుంది.