Narasapuram MPDO: తొమ్మిది రోజుల తరువాత ఏపీ ఎంపీడీవో మృతదేహాం లభ్యం
ఎనిమిది రోజులుగా ఎంపిడిఓ వెంకట రమణారావు కోసం రెస్క్యూ సిబ్బంది వెతికింది. ఈ నెల 15వ తేదీన మధురానగర్ రైల్వే బ్రిడ్జి పై నుంచి కాల్వలోకి దూకిన ఘటనలో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈరోజు ఏలూరు కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- By Praveen Aluthuru Published Date - 02:55 PM, Tue - 23 July 24

- నరసాపురం ఎంపీడీవో మృతి మిస్టరీ
- ఏలూరు కాలువలో మృతదేహం గుర్తింపు
- ఈ నెల 15 న మిస్ అయిన ఎంపీడీవో
Narasapuram MPDO: నరసాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ) వెంకట రమణారావు అదృశ్యం విషాదంతో ముగిసింది. తొమ్మిదిరోజుల తరువాత అతని మృతదేహం లభ్యం కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే అతని మృతి మిస్టరీపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
ఎనిమిది రోజులుగా ఎంపిడిఓ వెంకట రమణారావు కోసం రెస్క్యూ సిబ్బంది వెతికింది. ఈ నెల 15వ తేదీన మధురానగర్ రైల్వే బ్రిడ్జి పై నుంచి కాల్వలోకి దూకిన ఘటనలో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్థానిక పెనమలూరు పోలీసులు వెంటనే అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈరోజు ఏలూరు కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
15వ తేదీన మచిలీపట్నంలో ఎదో పని ఉందని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని మరోసారి సమాచారం ఇచ్చాడు. అయితే ఇంటికి రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని, మీరేం టెన్షన్ పడకండి అంటూ చెప్పాడు. బాధాకరమైన విషయం ఏంటంటే నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజని, అందరూ జాగ్రత్త అని అర్ధరాత్రి కుమారుడికి ఒక మెసేజ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చివరకు ఆయన అనుకున్నట్టే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఈ విషాద వార్త రావు కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని చూసిన ఆయన కుమారులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read: AP Assembly : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు..ఏపి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం