PV Ramesh: పీవీ రమేష్‌ని టార్గెట్ చేస్తోంది ఆయనేనా!
పీవీ రమేష్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన్ను టార్గెట్ చేస్తోంది ఎవరు? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్‌గా మారింది.
- By Hashtag U Published Date - 12:45 PM, Wed - 19 January 22

పీవీ రమేష్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన్ను టార్గెట్ చేస్తోంది ఎవరు? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్‌గా మారింది.
పీవీ రమేష్ సీనియర్ ఐఏఎస్‌గా మంచి గుర్తింపు పొందారు. జగన్ సీఎం అయ్యాక కూడా కీలక పోస్టింగ్‌లో ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత ఆయన్ను తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పీవీ రమేష్ సైలెంట్‌గా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన తల్లిదండ్రులకు నోలీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. పీవీ రమేష్ సోదరుడిపై 2018లో కేసు నమోదైంది. ఆయన భార్య 498A కేసు పెట్టారు. ఇప్పుడా కేసులోనే పీవీ రమేష్ తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ పటమట పోలీసులు కొండాపూర్‌లోని వారి ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చి ఈ నెల 22న విచారణకు రావాలని స్పష్టం చేశారు.
పోలీసుల నోటీసులతో పీవీ రమేష్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ప్రస్తుత ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఇదంతా చేస్తున్నారన్నది వారి ఆరోపణ. సునీల్‌కుమార్‌కు, పీవీ రమేష్‌కు దగ్గరి బంధుత్వం ఉంది. పీవీ రమేష్ సోదరినే సునీల్‌కుమార్ వివాహం చేసుకున్నారు. వారి మధ్య కూడా కొన్ని సమస్యలు ఉన్నాయనే చర్చ ఉంది.
రిటైర్డ్ అయిన తర్వాత పీవీ రమేష్‌కు, ప్రభుత్వ పెద్దలకు మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ ఉంది. ఈ పరిణామాలతో పీవీ రమేష్ టార్గెట్ అయ్యారని తెలుస్తోంది. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోనూ పీవీ రమేష్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలొచ్చాయి. వీటన్నింటి వెనుక సీఐడీ చీఫ్ సునీల్‌కుమారే ఉన్నారనేది రమేష్ తల్లిదండ్రుల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను ఖండించారు సునీల్‌కుమార్. ఈ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.