AP : ముందు నీ బతుకేంటో చూసుకో..! – పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్
నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని సీఎం జగన్ అనేంతటివాడివా నువ్వు... ముందు నీ బతుకేంటో చూసుకో అంటూ
- By Sudheer Published Date - 05:01 PM, Sun - 17 September 23

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై మంత్రి రోజా (RK Roja) రోజు రోజుకు మరింత రెచ్చిపోతుంది. ఓ పక్క జనసేన శ్రేణులు రోజా తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ..రోజా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. కేవలం రోజా మాత్రమే కాదు వైసీపీ మంత్రులెవరూ కూడా వారి వారి శాఖలకు సంబదించిన ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టింది లేదు..కేవలం పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకే మీడియా ముందుకు వస్తారని అంటున్నప్పటికీ..వారు మా తీరు అన్నట్లే ప్రవర్తిస్తున్నారు.
తాజాగా మరోసారి అలాగే వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని సీఎం జగన్ అనేంతటివాడివా నువ్వు… ముందు నీ బతుకేంటో చూసుకో అంటూ ఘాటుగా రోజా స్పందించింది.
జగన్ (YS Jagan) కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పటిదాకా వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ కల్యాణ్ అని, తన స్థాయికి మించి మాట్లాడడం తగదని హితవు పలికారు. జగన్ 13 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారని, మరో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని రోజా వెల్లడించారు. జగన్ ఒకసారి విపక్ష నేతగా ఉన్నారని, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం పీఠం అధిష్ఠించారని చెప్పుకొచ్చింది.
Read Also : IND vs SL: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు
అలాగే నారా బ్రాహ్మణి (Nara Brahmani) ఫై కూడా రోజా ఫైర్ అయ్యారు. మీ మామ చంద్రబాబు ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా? అని ప్రశ్నించారు. కావాలంటే, ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియోను బ్రాహ్మణి ఓసారి చూడాలని హితవు పలికారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించవద్దని, ఒకవేళ ఆ రిపోర్ట్ చూపిస్తే మా తాత ఇంత అవినీతిపరుడా అని దేవాన్ష్ అనుకుంటాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారంటున్న బ్రాహ్మణి… ఓసారి సీఐడీ ఆఫీసుకెళ్లి అడిగితే సాక్ష్యాధారాలు చూపిస్తారని రోజా అన్నారు. బ్రాహ్మణి మాటలు చూస్తే, ఆమెకు చదువు చెప్పిన వాళ్లు తల గోడకేసి కొట్టుకుంటారని వ్యంగ్యం ప్రదర్శించారు. బ్రాహ్మణిని ఓ బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని, కానీ ఆమె తుస్సుమందని ఎద్దేవా చేశారు.