Roja With Modi: మోడీతో రోజా సెల్ఫీ.. వీడియో వైరల్!
అజాదికా అమృత్ మహోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలో పర్యటిస్తున్నారు.
- Author : Balu J
Date : 04-07-2022 - 1:10 IST
Published By : Hashtagu Telugu Desk
అజాదికా అమృత్ మహోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలో పర్యటిస్తున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభకు హాజరయ్యారు. ఇటీవల ఏపీ టూరిజం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన రోజా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వేదికపైకి వచ్చిన మోడీ దగ్గరికి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. పక్కన సీఎం జగన్ పిలిచి మరి ఇద్దరితో సెల్ఫీ తీసుకుంది రోజా. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరు సెల్ఫీలు తగలెయ్యా.. అని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు దటీజ్ రోజా అంటూ కామెంట్స్ చేశారు.