HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rgv Ket Tweets

RGV : చంద్రబాబుపై నా ఒపీనియన్ ఎప్పటికీ మారదు – వర్మ

RGV : నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి

  • Author : Sudheer Date : 28-11-2024 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Varma Cbn
Varma Cbn

NTRను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబు(Chandrababu)పై నాకు సదభిప్రాయం పోయిందని, ఇక అది ఎప్పటికీ మారదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) అన్నారు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ పరారీ లో ఉన్నట్లు గత నాల్గు రోజులుగా మీడియా లో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ అండ చూసుకొని వర్మ..చంద్రబాబు , లోకేష్ , పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగానే కాకుండా సినిమాల ద్వారా కూడా చంద్రబాబు పై పరోక్షంగా విమర్శలు చేసాడు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడం తో టిడిపి శ్రేణులు వరుసపెట్టి వర్మ పై పిర్యాదులు చేస్తుండడం , పోలీసులు పలు సెక్షన్ల పేరుతో కేసులు నమోదు చేయడం చేస్తున్నారు. రీసెంట్ గా ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి వెళ్లి నోటీసులు సైతం ఇవ్వడం జరిగింది. విచారణ కు హాజరుకావాలని కోరినప్పటికీ , సినిమాల షూటింగ్ లలో బిజీ గా ఉన్న అని చెప్పి విచారణ కు హాజరుకాలేకపోతున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా వర్మ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయి’ అని ట్వీట్ చేశారు.

అలాగే NTRను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబుపై నాకు సదభిప్రాయం పోయిందని, ఇక అది ఎప్పటికీ మారదని వర్మ తెలిపాడు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించానని అన్నారు. ‘రాజకీయ నేతలు పోలీసులను ఆయుధంగా మార్చుకుని పనిచేస్తున్నారు. ఏడాది కిందట పెట్టిన ట్వీట్పై ఇప్పుడు కేసులు ఏంటీ? నాపై కేసు పెట్టిన 9 మందికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందేమో’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

1.

నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.

2.

ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు?

3.

నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్ గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.

4.

ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్ లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.

5.

నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్ లొ నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్ళకి అనుమానం కలిగింది.

6.

నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాను, చాలా సార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం కు సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది

7.

నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల లో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.

8.

ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.

9.

BNS 336(4)

ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డు ను కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం

నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి. ?

10.

BNS 353(2)

తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం

నా కేసు విషయం లో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదని వరుస ట్వీట్ చేసారు.

నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews

1.

నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…

— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • ntr
  • ram gopal varma . chandrababu
  • varma cases

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

  • Ntr Favorite Snacks

    NTR Favorite Snacks : ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ అవేనట !!

Latest News

  • గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • ఏపీ నిరుద్యోగులకు ఉగాది కానుక ..ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd