Reddappagari Madhavi Reddy : కడప మాధవీరెడ్డి కనుసైగ చూసి వణుకుతున్న వైసీపీ నేతలు
Reddappagari Madhavi Reddy : గురువారం కడప జిల్లా డీఆర్సీ సమావేశం జరుగగా.. ఆ సమావేశంలో జగన్ తీరును తప్పు పట్టారు. ఎందుకు సమావేశానికి రాలేదని ఆమె ప్రశ్నించిన వైనం మీడియా లో వైరల్ గా మారింది
- By Sudheer Published Date - 03:37 PM, Thu - 7 November 24

కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి (Reddappagari Madhavi Reddy) ..పేరు నిన్నటి నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మాధవీరెడ్డి కనుసైగ చూసి వైసీపీ నేతలు (YCP Leaders) ఖంగారు కాదు ఉ..పోసుకోవడమే తక్కువైంది. ఆ రేంజ్ లో ఆమె హెచ్చరించింది. మాధవీరెడ్డి అంటే ఇప్పుడు వామ్మో ఆమెతో పెట్టుకోవడం కంటే మూసుకొని కూర్చువడమే మంచిదని మాట్లాడుకుంటున్నారు.
గురువారం కడప జిల్లా డీఆర్సీ సమావేశం జరుగగా.. ఆ సమావేశంలో జగన్ తీరును తప్పు పట్టారు. ఎందుకు సమావేశానికి రాలేదని ఆమె ప్రశ్నించిన వైనం మీడియా లో వైరల్ గా మారింది. జగన్ రాలేదు.. అవినాష్ రెడ్డి రాలేదు. మాములుగా అవినాష్ రెడ్డి వస్తారు. కానీ ఇప్పుడు డీఆర్సీలో టీడీపీ ప్రాబల్యం ఉంది. అందుకే ఆయన కూడా డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని మాధవీరెడ్డి ప్రశ్నించిన వైనం వైరల్ గా మారింది.
ఒక్క రోజు గడవక ముందే అధికారికంగా మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో ఆమెను ఎదుర్కోవడం కష్టమని భావించి ముందుగానే ప్రోటోకాల్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క కార్పొరేటరే గెలిచారు. తరవాత మాధవీరెడ్డి సమక్షంలో కొంత మంది టీడీపీలో చేరారు. మాములుగా అయితే వైసీపీ కార్పొరేటర్లు ఏకపక్షంగా సభను నిర్వహించుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే హోదాలో మాధవీరెడ్డి కౌన్సిల్ భేటీకి వస్తున్నారని తెలియగానే అందరిలో వణుకు మొదలైంది . ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు కుర్చీ వేయలేదు. మాట్లాడుతూంటే అడ్డుకున్నారు. దీంతో ఆమె బయటకు వచ్చి వైసీపీ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈమె మాట్లాడిన తీరు మీడియా లో వైరల్ గా మారింది.
మాధవిరెడ్డి తన భర్త రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2023లో కడప నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమితురాలై, పార్టీ బలోపేతానికి కృషి చేసి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కడప నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి అంజాద్ భాషా షేక్ బెపారిపై 18,860 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.
Read Also : ED Notices : మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు