Sri Sathyasai District : హోలీ పేరుతో అమ్మాయిలతో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన
Sri Sathyasai District : హోలీ సంబరాల పేరుతో ఆయన విద్యార్థినులను బలవంతంగా ఎత్తుకొని బురదలో పడేసి దొర్లించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
- By Sudheer Published Date - 09:00 PM, Sat - 15 March 25

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathyasai District) కదిరిలోని అమృతవల్లి మహిళా డిగ్రీ కాలేజీ(Amrutavalli Women’s Degree College)లో హోలీ(Holi) వేడుకలు వివాదాస్పదమయ్యాయి. కాలేజీ ప్రిన్సిపల్ వెంకటపతి (College Principal Venkatapathy) విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. హోలీ సంబరాల పేరుతో ఆయన విద్యార్థినులను బలవంతంగా ఎత్తుకొని బురదలో పడేసి దొర్లించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Sundar Pichai: క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.. కానీ ఇప్పుడు రోజుకు రూ. 6.67 కోట్లు సంపాదన!
ప్రిన్సిపల్ ప్రవర్తనపై విద్యార్థినులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు గౌరవం కల్పించాల్సిన స్థానంలో ఉన్న ప్రిన్సిపల్ ఇలా ప్రవర్తించడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, కాలేజీ యాజమాన్యాన్ని మరియు అధికారులను విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ఇటీవల కాలంలో విద్యాసంస్థల్లో ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి. విద్యార్థినుల భద్రతపై శిక్షణ పొందిన బోధన సిబ్బంది కూడా అసభ్య ప్రవర్తనకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయం. ప్రిన్సిపల్ వెంకటపతి వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా నిర్దిష్ట నియమాలు, నియంత్రణలు అమలుచేయాలని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.