Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ది మూర్ఖత్వ రాజకీయాలు – ప్రకాష్ రాజ్
Pawan Kalyan : 'పవన్ కళ్యాణ్ మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు. అందుకే చెబుతున్నా. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది. ఇందుకోసం కాదుగా. అడిగేవాడు ఒకడు ఉండాలి'
- Author : Sudheer
Date : 27-10-2024 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకు అంత కోపం అని జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘పవన్ కళ్యాణ్ మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు. అందుకే చెబుతున్నా. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది. ఇందుకోసం కాదుగా. అడిగేవాడు ఒకడు ఉండాలి’ అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ వివాదస్పద కామెంట్స్ చేయడం కొత్తమీ కాదు..గత కొద్దీ రోజులుగా పవన్ పై విరుచుకపడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సినీ ప్రాచుర్యాన్ని రాజకీయాల్లో అనుకూలంగా వాడుకుంటున్నారని, కానీ ప్రజల భవిష్యత్తు కోసం పని చేసే స్థాయిలో నిజాయితీగా వ్యవహరించడం లేదని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
తిరుమల లడ్డూ అంశంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి గురించి మాట్లాడుతూ.. పవన్ అలా చేయడం పవిత్ర ఆలయ సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, పవన్ కళ్యాణ్ ఒక సామాన్య రాజకీయ నాయకుడిగా కాకుండా బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు. పవన్ ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఏకాగ్రతతో పని చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆయన చెప్పిన విధ్వంసక రాజకీయాలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. ఇక పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై అభిమానులు , పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ప్రారంభం