Posani Krishna Murali : నెక్స్ట్ అరెస్ట్ పోసానేనా..?
Posani Krishna Murali : ఎవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఎవరిపై ఎలాంటి కేసులు పెడతారో..? పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో..? అరెస్ట్ అయితే బయటకు వచ్చింది ఎలానో..? ఎవరు తమను ఆదుకుంటారో..? ఇలా అనేక ప్రశ్నలతో వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నారు
- By Sudheer Published Date - 12:25 PM, Mon - 11 November 24

ఏపీలో కూటమి సర్కార్ వైసీపీ నేతలకు , అనుచరులకు , వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు చెమటలు పట్టిస్తుంది. ఎవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఎవరిపై ఎలాంటి కేసులు పెడతారో..? పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో..? అరెస్ట్ అయితే బయటకు వచ్చింది ఎలానో..? ఎవరు తమను ఆదుకుంటారో..? ఇలా అనేక ప్రశ్నలతో వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నారు. పోలీస్ సైరన్ వస్తే చాలు పాయింట్లు తడుపుకుంటున్నారు. ఎందుకురా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లతో పెట్టుకున్నాం..? అంటూ ఇప్పుడు బాధపడుతున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఏ రేంజ్ లో రెచ్చిపోయారో తెలియంది కాదు..తమ స్థాయి..తమ స్థానం ఏంటో మరచిపోయి..అమ్మనాబూతుల దగ్గరినుండి ఇంట్లో ఉన్న ఆడవారిపై వరకు ఇష్టానురీతిలో రెచ్చిపోయారు. ఇన్ని చేసిన వారిని ఊరికే వదిలిపెడుతుందా కూటమి సర్కార్..అందరి లెక్కలు సరిచేసి మళ్లీ నోరు ఎత్తాలంటే ఉ..కారిపోయేలా చేస్తుంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతల దగ్గరి నుండి సోషల్ మీడియా లో రెచ్చిపోయిన వారి వరకు వరుస పెట్టి అరెస్ట్ లు చేస్తుంది. దీంతో శ్రీ రెడ్డి దగ్గరి నుండి చాలామంది బయటకు వచ్చి క్షేమపణలు కోరుతున్నారు. క్షేమించడండి అంటే సరిపోదు కదా..అన్న మాటలు , చేసిన దారుణాలు మరచిపోతే మరచిపోయేవి కాదు కదా..
ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయబోయేది పోసాని కృష్ణ మురళినినే అని గట్టిగా ప్రచారం అవుతుంది. చిత్రసీమలో రైటర్ గా , డైరెక్టర్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో మొట్టమొదట సారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చిలకలూరిపేట పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తనకు ఎలాంటి పొలిటికల్ ఇమేజ్ లేకపోయినా… చిరంజీవి పుణ్యాణ 14 వేల ఓట్లు మాత్రం దక్కించుకుని మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు
వైసీపీ స్థాపన తరువాత పోసాని ..జగన్ పంచకు చేరారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. కానీ జగన్ మాత్రం 2014 నుంచి 2024 వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే పోసాని నోటి దూకుడు నచ్చి .. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి పోసాని నోటికి అడ్డు అదుపులేకుండా పోయింది. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై ఓ రేంజ్ లో విమర్శలు , ఆరోపణలు , కీలక వ్యాఖ్యలు చేసారు. తాను కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూనే.. కులాన్ని కించపరిచేలా మాట్లాడం, చంద్రబాబు కులాని వాడుకుంటున్నారని విమర్శించడం ఆయనకే చెల్లింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరని.. పవన్ కల్యాణ్ ఓ మెంటల్ కేసని ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత కూడా పోసాని నోటికి తాళం వెయ్యకుండా అలాగే మాట్లాడుతూ వచ్చాడు.
ఇక ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలుకావడం తో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయ్యారు. మెంటల్ కృష్ణ మాత్రం నోటి దూకుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. లడ్డూ వివాదం, డిక్లరేషన్ రగడ, జగన్ తిరుమల పర్యటన రద్దు తదితర అంశాలపై పోసాని కృష్ణమురళి అప్పట్లోతీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆయన్ను కటకటాలకు నెట్టేవేయబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే పోలీసులు..పోసాని ని అరెస్ట్ చేయబోతున్నారని వినికిడి.
Read Also : TCS Biggest Gainer: సంచలనం సృష్టించిన రతన్ టాటా టీసీఎస్..!