Sri Reddy : 41A నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించిన పోలీసులు
Sri Reddy : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్(Nellimarla Police Station)లో నమోదైన కేసులో ఆమె విచారణకు హాజరయ్యారు
- Author : Sudheer
Date : 19-04-2025 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
జగన్ అండ చూసుకొని సోషల్ మీడియా(Social Media)లో బరితెగించి వివాదాస్పద వీడియోలు, పోస్టులు షేర్ చేస్తూ ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి (Sri Reddy)ఈరోజు విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్(Nellimarla Police Station)లో నమోదైన కేసులో ఆమె విచారణకు హాజరయ్యారు. పూసపాటిరేగ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన విచారణ అనంతరం 41A నోటీసులు జారీ చేసి శ్రీరెడ్డిని విడుదల చేశారు.
Abhishek Nayar: కేకేఆర్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అభిషేక్ నాయర్.. క్లారిటీ ఇచ్చిన కోల్‌కతా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, 2024 ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీ మారినప్పుడు తన వైఖరిని మార్చుకోవడం ఆసక్తికర అంశంగా మారింది. టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆమెపై వెంటనే చర్యలు తీసుకోలేదని వార్తల్లో చర్చ జరిగింది. అయినా మహిళ అని గౌరవం చూపించి మౌనంగా ఉన్న అధికార పార్టీ నేతలపై ఆమె మరోసారి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ శ్రేణులు స్పందించి కేసులు నమోదు చేశారు.
శ్రీరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆమె ఫిబ్రవరిలో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కొంతవరకు కోర్టు తిరస్కరించింది. అయితే విశాఖ కేసులో కొన్ని షరతులతో బెయిల్ మంజూరైంది. కర్నూలు, గుడివాడ, నెల్లిమర్ల కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్షలకు సంబంధించినవే కావడంతో విచారణలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామంలో శ్రీరెడ్డి ఈరోజు నెల్లిమర్ల కేసులో విచారణకు హాజరవడం ఆమెపై కొనసాగుతున్న చట్టపరమైన దర్యాప్తులో కీలక ఘట్టంగా నిలిచింది.