Bapatla: సముద్రంలోకి కొట్టుకుపోతూ యువకులు.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు
పోలీసులు రియల్ హీరోస్ అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా బాపట్ల సముద్రంలో ఓ పోలీస్ చేసిన పనికి అభినందిస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 14-08-2023 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
Bapatla: పోలీసులు రియల్ హీరోస్ అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా బాపట్ల సముద్రంలో ఇద్దరు పోలీసులు చేసిన పనికి అభినందిస్తున్నారు. ఆదివారం కావడంతో బీచ్ కు ప్రజలు క్యూ కట్టారు. సరదాగా ఆడుతూ పాడుతూ గాడిపారు. అయితే అలల తాకిడి ఎక్కువ అవ్వడంతో ఇద్దరు యువకులు అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా అప్పుడే ఇద్దరు పోలీసులు పరుగు తీశారు. ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఆ యువకుల్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.
ఆపద వస్తే దేవుడు వస్తాడో రాడో.. తెలియదు కానీ పోలీస్ మాత్రం వస్తాడు ఆ పోలీస్ నిరూపించాడు. ఆదివారం సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితులు కర్నూలు జిల్లా వాసులు. పుల్లేటి మహేష్, గోగుల రమణ ఇరువురు స్నేహితులతో కలిసి బాపట్ల వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారిద్దరు కొట్టుకుపోయారు. కానిస్టేబుళ్లు ఎస్.గణేష్, ఎం.వెంకటేశ్వర్లు చేసిన త్యాగానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెరైన్ సీఐ వారిని అభినందించారు
Also Read: Rains From August 20 : తెలంగాణలో వానలు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే ?