Krishna Reddy : YS వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంట్లో పోలీసుల దర్యాప్తు
Krishna Reddy : పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ (Pulivendula DSP Muralinayak) సమక్షంలో కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది
- By Sudheer Published Date - 11:10 AM, Mon - 18 November 24

వైస్సార్ జిల్లా పులివెందులలోని YS వివేకా పీఏ కృష్ణారెడ్డి (Ys Vivekananda Reddy Pa Krishna Reddy) ఇంటికి సోమవారం పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ (Pulivendula DSP Muralinayak) సమక్షంలో కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది. 2022లో వివేకా కుమార్తె సునీత (Viveka’s daughter is Sunita), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్సింగ్ పై కృష్ణారెడ్డి ఓ ప్రైవేట్ కంప్లెంట్ దాఖలు చేయగా, వారిపై కేసు నమోదైంది. ఆయన ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. డీఎస్పీ అడిగే ప్రశ్నలు ఆయన చెప్పే సమాధానాలను ఆడియో, వీడియో కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్ సునీత సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీని కూడా ఆమె కలిశారు. తాజాగా ఇందులోని పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని , అంతేకాదు సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని కూడా ఆరోపించారు. 2023లో పులివెందుల కోర్టు విచారణ జరిపి.. ముగ్గురి (సునీత రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రామ్సింగ్)పై కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఆ వెంటనే పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని సునీత రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటిని నాలుగు వారాలు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని తెలిపింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Read Also : Delhi Weather : ఢిల్లీలో గాలి కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఆరెంజ్ అలర్ట్