Pithapuram Constituency : వంగా గీత ఫై మండిపడుతున్న పిఠాపురం ప్రజలు
కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు
- By Sudheer Published Date - 11:07 AM, Tue - 9 July 24

పిఠాపురం (Pithapuram ) ఈ పేరు ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఆరు నెలల క్రితం వరకు కూడా పిఠాపురం అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్నాడనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుండి అంత పిఠాపురం పేరును జపం చేస్తూ వచ్చారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయం సాధించడం పట్ల యావత్ సినీ అభిమానులు, సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు ఇలా ప్రజలంతా సంతోషం వ్యక్తం చేసారు. తనను అఖండ మెజార్టీ తో గెలిపించిన ప్రజలకు పవన్ తన మార్క్ అభివృద్ధి మొదలుపెట్టారు. ఇప్పటికే నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇదే తరుణంలో పిఠాపురం బరిలో వైసీపీ నుండి నిల్చుని..పవన్ చేతిలో ఓడిపోయిన వంగా గీత (Vanga Geetha) అప్పుడే పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమె కామెంట్స్ ఫై నియోజవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు మీరు ఏంచేశారని ప్రశ్నిస్తున్నారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే కీలక హామీలను నెరవేర్చారని..ఇంకా నెరవేరుస్తూనే ఉన్నారని, రోడ్లు బాగు చేస్తున్నారు..నియోజకవర్గం లో చాల సమస్యలు తిర్చారని ఇంతకన్నా ఏంచేస్తారు నెల రోజుల్లో అంటూ మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram)లో స్థలం కొనుగోలు చేసారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి.. 2.08 ఎకరాలు (3 Acre Land) మరో బిట్ స్థలం కొనుగోలు చేసి, భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. పవన్ ఇక్కడి వాడు కాదు..మళ్లీ హైదరాబాద్ కు వెళ్ళిపోతాడని లోకల్ వాడు కానేకాదు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేసిన వైసీపీ నేతలకు చెక్ పెట్టాడు. పవన్ భూమి కొనుగోలు చేయడం తో ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మూడు రేట్లు ప్రస్తుతం అక్కడ ధరలు పెరిగాయని రైతులు అంటున్నారు.
Read Also : Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. తొలి టూర్ ఇదే..!