Pithapuram : జనసేనలోకి పెండెం దొరబాబు..?
పెండెం దొరబాబు కూడా జనసేన లోకి వచ్చేందుకు సిద్దమయ్యాడనే వార్తలు ఉపంచుకున్నాయి
- By Sudheer Published Date - 09:45 PM, Mon - 29 July 24

జనసేన (Janasena)లోకి పెండెం దొరబాబు (Pendem Dorababu) చేరబోతున్నారనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఏపీ ఎన్నికల ముందే ఈ ప్రచారంజరుగగా..ఆతర్వాత సైలెంట్ అయ్యింది. కానీ ఇప్పుడు దొరబాబు..జనసేన లోకి ఎలాంటి పదవి ఆశించకుండా చేరేందుకు సిద్ధం అయ్యాడనే వార్తలు వైరల్ గా మారిపోయాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం పిఠాపురం లోనే కాదు జనసేన అభ్యర్థులు బరిలో నిల్చున్న 22 స్థానాల్లో విజయం సాధించి జనసేన పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. ఈ విజయం తర్వాత పవన్ డిప్యూటీ సీఎం తో పాటు పలు శాఖలకు మంత్రిగా భాద్యతలు చేపట్టి..తన మార్క్ కనపరుస్తున్నారు. ప్రజల్లో కూడా రోజు రోజుకు జనసేన ఫై ఆదరణ పెరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో వైసీపీ కి చెందిన నేతలు జనసేన వైపు చూస్తున్నారు. పెండెం దొరబాబు కూడా జనసేన లోకి వచ్చేందుకు సిద్దమయ్యాడనే వార్తలు ఉపంచుకున్నాయి. వాస్తవానికి పిఠాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా దొరబాబు బరిలో నిలువాలని అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో జగన్ తనకు కాదని వంగ గీత కు టికెట్ ఇచ్చారు. దీంతో దొరబాబు..వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఎన్నికల్లో కూడా జనసేన కు సపోర్ట్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది.
ఇక ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ఫై ప్రజలు ఏమాత్రం నమ్మకంగా లేకపోవడం..అసలు ఆ పార్టీ నే పట్టించుకోకుండా ఉండడం తో చాలామంది బయటకు వస్తున్నారు. ఇక దొరబాబు కూడా జనసేన లో చేరాలని డిసైడ్ అయ్యాడట. ఇటీవల అల్లుడు రామయ్యతో కలిసి పవన్‌తో దొరబాబు సమావేశమయ్యారని తెలుస్తోంది. ఢిల్లీలో జగన్ నిరసనకు దూరంగా ఉంటున్న దొరబాబు.. రెండు, మూడు రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన లో చేరబోతున్నట్లు వినికిడి.
Read Also : Bonalu Festival : బోనాల పండుగ అంటే తాగే పండుగ – ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు