Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ వ్యాధితో బాధపడుతున్నాడట..షాకింగ్ విషయం తెలిపిన జనసేన
రికరెంట్ ఇన్ ఫ్లుయెంజా కారణంగా పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ముతో బాధపడుతున్నారని, ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఆయనకు జ్వరం వస్తోందని వెల్లడించి షాక్ ఇచ్చింది
- Author : Sudheer
Date : 20-04-2024 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ఇటీవల తరుచు జ్వరంతో పడుతున్న సంగతి తెలిసిందే. వయసు రీత్యా..గత కొద్దీ నెలలుగా క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్లు , ఇటు రాజకీయాలతో బిజీ బిజీ గా గడుపుతుండడంతో ఆయన జ్వరం (Fever) బారినపడుతున్నారు కావొచ్చు అని అంత అనుకున్నారు. కానీ ఈరోజు జనసేన పార్టీ కీలక ప్రకటన తెలిపి షాక్ ఇచ్చింది. రికరెంట్ ఇన్ ఫ్లుయెంజా (Influenza) కారణంగా పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ముతో బాధపడుతున్నారని, ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఆయనకు జ్వరం వస్తోందని వెల్లడించి షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా అభిమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనసేన పార్టీ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
“పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు వేయవద్దని, అలాగే కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించింది. ఈ ప్రకటన చూసి అభిమానులు , కార్యకర్తలు షాక్ అవుతున్నారు. మా దేవుడు త్వరగా కోలుకోవాలంటూ వారంతా కోరుకుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 న ఆయన పిఠాపురం నుండి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు , జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది. ఈసారి పవన్..టిడిపి , బిజెపి తో కలిసి బరిలోకి దిగుతున్నాడు. 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు తమ నామినేషన్ ను దాఖలు చేయడం మొదలుపెట్టారు.
Read Also : Harish Shankar : ప్రెస్ నోట్‌తో చిరంజీవి మూవీ కెమెరామెన్‌కి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హరీష్ శంకర్..