HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Speech In Tanuku Prajagalam Public Meeting

Pawan Kalyan : వైసీపీ లో డ్యాన్సులు వేసే మంత్రులు , బూతులు తిట్టే నేతలే ఉన్నారు – పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేశామని పవన్ చెప్పుకొచ్చారు

  • Author : Sudheer Date : 10-04-2024 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Speech Tanuku
Pawan Speech Tanuku

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తణుకు (tanuku) లో ఏర్పాటు చేసిన ప్రజాగళం (Prajagalam) సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా చంద్రబాబు (Chandrababu) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరు అగ్ర నేతలు వైసీపీ పార్టీ ఫై నిప్పులు చెరుగుతూ స్థానిక నేతపై విమర్శల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేశామని పవన్ చెప్పుకొచ్చారు. మా అన్నయ్య నాగబాబు కు కూడా టికెట్ ఇవ్వలేకపోయామని..నేతలు అర్ధం చేసుకోవాలని కోరారు. సీఎం జగన్ క్లాస్ వార్ అంటున్నారు.. క్లాస్ వార్ అంటే.. డబ్బున్న వారు పేదవారిని దోచుకోవడమా..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

మధ్య తరగతి వారు, పేదల సమస్యలు తనకు తెలుసు అని, ఉద్యోగుల సీపీఎస్ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని , కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు చెబితే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చిన్న చూపు చూశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతును మంత్రి ఏడిపించారని గుర్తుచేశారు. ఆ మంత్రి కుమారుడు ఎన్నికల బరిలో ఉన్నారని, అతనికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ మంత్రివర్గంలో డాన్సులు వేసే మంత్రులు , బూతులు తిట్టే మంత్రులే ఉన్నారని, ప్రజల సమస్యలు పట్టించుకునే నేతే లేరని పవన్ ఆరోపించారు.

ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం DSC నోటిఫికేషన్ ఇవ్వలేదని, 70వేల పోలీస్ కుటుంబాలకు TA, DAలు ఇవ్వలేదు. రక్షణ కల్పించే పోలీసులనే CM రోడ్డునపడేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అవినీతి సొమ్మును మంత్రి హైదరాబాద్ (Hyderabad) తరలించాడని, బాలానగర్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఓటు చీలకూడదు అని ఇచ్చిన మాట కోసం చాలా తగ్గాను. ప్రజలు బాగుండాలని మా అభ్యర్థులను వెనక్కి తీసుకున్నా. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడిని’ అని వెల్లడించారు.

Read Also : Alert: ఏపీపై వడగాల్పుల ఎఫెక్ట్.. రేపు ఆ మండలాల ప్రజలు అలర్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Pawan Kalyan
  • Prajagalam Public Meeting
  • tanuku

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

    Latest News

    • Michael : ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ స్పెషల్ షో

    • UCG : కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం

    • Cigarette Prices : మరోసారి సిగరెట్ ధరలు పెరగనున్నాయా ..?

    • ABHFL : ఏపీలో విస్తరిస్తున్న ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్

    • Good News : ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd