Pawan Kalyan : వైసీపీ లో డ్యాన్సులు వేసే మంత్రులు , బూతులు తిట్టే నేతలే ఉన్నారు – పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేశామని పవన్ చెప్పుకొచ్చారు
- Author : Sudheer
Date : 10-04-2024 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తణుకు (tanuku) లో ఏర్పాటు చేసిన ప్రజాగళం (Prajagalam) సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా చంద్రబాబు (Chandrababu) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరు అగ్ర నేతలు వైసీపీ పార్టీ ఫై నిప్పులు చెరుగుతూ స్థానిక నేతపై విమర్శల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేశామని పవన్ చెప్పుకొచ్చారు. మా అన్నయ్య నాగబాబు కు కూడా టికెట్ ఇవ్వలేకపోయామని..నేతలు అర్ధం చేసుకోవాలని కోరారు. సీఎం జగన్ క్లాస్ వార్ అంటున్నారు.. క్లాస్ వార్ అంటే.. డబ్బున్న వారు పేదవారిని దోచుకోవడమా..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
మధ్య తరగతి వారు, పేదల సమస్యలు తనకు తెలుసు అని, ఉద్యోగుల సీపీఎస్ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని , కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు చెబితే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చిన్న చూపు చూశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతును మంత్రి ఏడిపించారని గుర్తుచేశారు. ఆ మంత్రి కుమారుడు ఎన్నికల బరిలో ఉన్నారని, అతనికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ మంత్రివర్గంలో డాన్సులు వేసే మంత్రులు , బూతులు తిట్టే మంత్రులే ఉన్నారని, ప్రజల సమస్యలు పట్టించుకునే నేతే లేరని పవన్ ఆరోపించారు.
ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం DSC నోటిఫికేషన్ ఇవ్వలేదని, 70వేల పోలీస్ కుటుంబాలకు TA, DAలు ఇవ్వలేదు. రక్షణ కల్పించే పోలీసులనే CM రోడ్డునపడేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అవినీతి సొమ్మును మంత్రి హైదరాబాద్ (Hyderabad) తరలించాడని, బాలానగర్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఓటు చీలకూడదు అని ఇచ్చిన మాట కోసం చాలా తగ్గాను. ప్రజలు బాగుండాలని మా అభ్యర్థులను వెనక్కి తీసుకున్నా. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడిని’ అని వెల్లడించారు.
Read Also : Alert: ఏపీపై వడగాల్పుల ఎఫెక్ట్.. రేపు ఆ మండలాల ప్రజలు అలర్ట్