Pawan Kalyan : మంత్రి పదవిలోకి నాగబాబు..తమ్ముడి క్లారిటీ ఇదే..!!
Pawan Kalyan : నాగబాబు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కోసం కృషి చేశారని, వైసీపీ నేతల నుంచి ఎదుర్కొన్న విమర్శలను నేరుగా స్వీకరించారని పవన్ గుర్తు చేసారు
- By Sudheer Published Date - 03:17 PM, Mon - 30 December 24

గత కొద్దీ రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కు మంత్రి పదవి (Minister Post) ఖరారైందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రచారం పై తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నాగబాబు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కోసం కృషి చేశారని, వైసీపీ నేతల నుంచి ఎదుర్కొన్న విమర్శలను నేరుగా స్వీకరించారని పవన్ గుర్తు చేసారు. ఆయనకు ముందుగా ఎమ్మెల్సీ పదవి అందజేయాలని, తరువాత చంద్రబాబు కేబినేట్‌లో మంత్రి పదవి కల్పించనున్నట్లు వెల్లడించారు. జనసేన లో కులం, బంధుప్రీతి కంటే పనితీరే ప్రామాణికమని స్పష్టం చేశారు. నాగబాబుకు పార్టీలో కీలక పాత్ర కల్పించటానికి అతని సేవలే ప్రేరణగా నిలిచాయని , అందులో భాగంగానే రాజ్యసభకు పంపాలని భావించినా, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదని వివరించారు. మౌలికంగా పార్టీలో పనిచేసే వారందరికీ గుర్తింపు ఇవ్వడం తమ లక్ష్యమని స్పష్టం చేసారు.
నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ వంటి నాయకుల గురించి పవన్ ప్రశంసలు కురిపించారు. కులం, మతం వంటి అంశాలకు అతీతంగా పార్టీ కోసం కృషి చేసిన వారికి అమాత్య పదవులు, ఎమ్మెల్సీ పదవులు అందజేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా కందుల దుర్గేష్ సేవలను గుర్తించి, అతనికి మంత్రి పదవి ఇచ్చినట్లు తెలిపారు. ప్రజాసేవకు అంకితమై పనిచేసే వారికి ఎల్లప్పుడూ పార్టీ గౌరవం ఇస్తుందని అన్నారు. జనసేన విజయానికి నిబద్ధంగా ఉన్న వారందరికీ తగిన గుర్తింపు కల్పించడం ద్వారా పార్టీ బలోపేతం చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటె జనవరి 15 నుండి 14 రోజుల పాటు జిల్లాలో పర్యటించి, ఆరు నెలల పాటు ప్రతి జిల్లాలో జనసమావేశాలు నిర్వహించనున్నట్లు పవన్ తెలిపారు. ఇలా ప్రజల మధ్య పర్యటించడం ద్వారా వారి సమస్యలు తెలుసుకొని, తగిన చర్యలు చేపడతామని, ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పాలన ముందుకు నడపటమే తమ ధ్యేయమని, పార్టీ భవిష్యత్తుకు ప్రజలు మద్దతు కీలకమని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Ethiopia : ఇథియోపియాలో ఘోరం.. నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి