AP : నారా భువనేశ్వరిని, బ్రాహ్మణిలను పరామర్శించిన పవన్ కళ్యాణ్
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను పవన్ పరామర్శించారు. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి..ధైర్యం చెప్పారు
- Author : Sudheer
Date : 14-09-2023 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu) చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..నేడు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ను కలిసి ధైర్యం చెప్పి. ఆరోగ్యం జాగ్రత్త అంటూ తెలిపారు. అనంతరం మీడియా తో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన పోటీ చేయబోతోందని తెలిపి టీడీపీ శ్రేణుల్లో ఉత్సహం నింపారు. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు కొద్ది దూరంలో చంద్రబాబు కుటుంబం బస చేస్తున్న క్యాంప్‌కు నారా లోకేష్ , బాలకృష్ణ లతో కలిసి పవన్ వెళ్లారు. అక్కడ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను పవన్ పరామర్శించారు. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి..ధైర్యం చెప్పారు. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని..అధైర్యం పడకూడదని తెలిపారు.
అంతకు ముందు మీడియా మాట్లాడుతా..జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం అని హెచ్చరించారు. గత కొద్దీ నెలలుగా నెలకొని ఉన్న ఉత్కంఠ కు తెరదించారు పవన్. ఈరోజు పవన్ కళ్యాణ్ అందరికి సమాధానం చెప్పాడు..నిన్నటి వరకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా..చేయవా..? దీనికి పవన్ ఏమంటారు..? చంద్రబాబు ఏమంటారు..? అసలు పొత్తు ఉంటుందా..లేదా..? కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందా..లేదా..? అంటూ మీడియా వారు.. మిగతా పార్టీ నేతలు మాట్లాడుకుంటూ.. ప్రశ్నించుకుంటూ..ప్రశ్నలు వేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ (Janasena TDP Alliance) చేయబోతున్నాం..ఇక వార్ వన్ సైడ్ అయినట్లే అని చెప్పకనే చెప్పాడు. ఈ ప్రకటన తో టీడీపీ , జనసేన కార్యకర్తలు సంతోషంలో మునిగిపోయారు.
Read Also : Chandrababu Arrest : నారా లోకేష్ కు ధైర్యం చెప్పిన జగన్ కుటుంబ సభ్యులు..