HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Is Shocked On Rammurthys Death

Ramamurthy Naidu Died : రామ్మూర్తి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

Ramamurthy Naidu Died : మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా

  • Author : Sudheer Date : 16-11-2024 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Rohit Pawan
Nara Rohit Pawan

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోదరుడు రామ్మూర్తి మృతి (Ramamurthy Naidu Died)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

నారా రామ్మూర్తి నాయుడి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన గుండెపోటు కారణంగా కన్నుమూయడంతో నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సోదరుడి వార్త తెలియగానే వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చంద్రబాబు , నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు నివాళులు అర్పించారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పితృ వియోగంతో శోకసంద్రంలో మునిగిపోయిన హీరో నారా రోహిత్ ను తన పెద్దనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. రామ్మూర్తి కుమారులైన గిరీశ్, రోహిత్లను హత్తుకుని ధైర్యం చెప్పారు. మరోపక్క రామ్మూర్తికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన AIG ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రామ్మూర్తి నాయుడు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు ప్రకటన విడుదల చేశారు. 1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. చంద్రబాబు కు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. రీసెంట్ గా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రతినిధి-2లో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

రోహిత్ తన ప్రేమ విషయాన్నీ ముందుగా పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పినట్లు ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి. రోహిత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత… భువనేశ్వరి పెళ్లి పెద్దగా మారారని నారా, నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. శిరీష కుటుంబ సభ్యులతో ఆవిడ స్వయంగా మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో నోవాటెల్ హోటల్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. డిసెంబర్ లో పెళ్లి వేడుక జరపాలని అనుకున్నారు కానీ ఇప్పుడు తండ్రి మరణంతో రోహిత్ శోకసంద్రంలో పడిపోయాడు.

Read Also : Woolen Clothes Allergy : ఉన్ని బట్టలంటే మీకు కూడా అలర్జీ ఉందా? చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే దద్దుర్లు రావు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Brother Died
  • Nara Rohit
  • Pawan Kalyan
  • Ram Murti Naidu News
  • Rammurthy's death

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd