Pithapuram : మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్
పురుహూతికా ఆలయంలో 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణలో పాల్గొనే 12 వేల మంది మహిళలకు సొంత డబ్బుతో చీరలు, వ్రత పూజ సామాగ్రి అందించనున్నారు
- By Sudheer Published Date - 03:55 PM, Thu - 29 August 24

పిఠాపురం (Pithapuram ) మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. పురుహూతికా ఆలయంలో 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణలో పాల్గొనే 12 వేల మంది మహిళలకు సొంత డబ్బుతో చీరలు, వ్రత పూజ సామాగ్రి అందించనున్నారు. వీటిల్లో 6వేల చీరలను పసుపు-కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద, మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించనున్నారు. MLC హరిప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా.. ప్రతీ ఏటా శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పురూహూతికా ఆలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. అలాగే ఆగస్టు 30వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. ఇక్కడికి వచ్చే మహిళల కోసం డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్‌లను అందిస్తున్నారు.
ఆలయ ఈవో భవాని ఈ ఏడాది గతంలోలా కాకుండా మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. మొత్తం మూడు బ్యాచులుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు తగిన్ ఏర్పాట్లు చేసినట్టు ఆమె హరిప్రసాద్ కు చెప్పారు. మొత్తం మీద ఎమ్మెల్యే గా ఎన్నికైన తొలి ఏడాదే పిఠాపురం మహిళలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో ఏకంగా 12 వేల చీరలను పంచిపెట్టడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఎమ్మెల్యే గా గెలిచింది లేదు..అలాంటిది ఏపీ ఎన్నికల్లో తాను గెలవడమే కాదు జనసేన నుండి బరిలో నిల్చున్న 21 ఎమ్మెల్యేలు , 2 ఎంపిస్థానాల్లో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. పిఠాపురం నుండి బరిలో దిగిన పవన్..భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఈ క్రమంలో తనపై పెట్టుకున్న పిఠాపురం ప్రజల కోర్కెలను తీర్చడమే తన బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
రేపు పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బుతో 12 వేల మందికి చీరలు,వ్రత పూజ సామాగ్రి పంపిణీ చేయనున్నారు 😍🙏🏻🙏🏻@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/mDAJ2SJeDI
— Prasannakumar Nalle (@PrasannaNalle) August 29, 2024
Read Also : Chain Snatchers : ఎమ్మెల్యే భార్య గొలుసును లాక్కెళ్లిన చైన్ స్నాచర్లు