Pawan Kalyan : పిఠాపురంలో స్థలం కొన్న మంత్రి పవన్ కళ్యాణ్..విలువ ఎంతంటే..!!
పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి.. 2.08 ఎకరాలు మరో బిట్ స్థలం కొనుగోలు
- Author : Sudheer
Date : 04-07-2024 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన నియోజకవర్గం పిఠాపురం (Pithapuram)లో స్థలం కొనుగోలు చేసారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి.. 2.08 ఎకరాలు (3 Acre Land) మరో బిట్ స్థలం కొనుగోలు చేసి, భూమికి సంబంధించి.. బుధవారం మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే నిన్న పిఠాపురం పర్యటన లో తెలియజేసారు. ఇప్పుడే ఇక్కడ స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ఫైల్స్ ఫై సంతకం పెట్టి వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడే ఓ చక్కటి ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మించబోతున్నట్లు తెలిపారు. రెండు ఎకరాల్లో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకొని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ ప్రాంతంలో ఎకరం రూ.15-16లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే మొత్తం మూడు ఎకరాలకు దాదాపు అరకోటి వరకు పెట్టినట్లు అర్ధం అవుతుంది. మొన్నటి వరకు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై పలు విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ఇక్కడి వాడు కాదు..మళ్లీ హైదరాబాద్ కు వెళ్ళిపోతాడని లోకల్ వాడు కానేకాదు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు..ఇక ఇప్పుడు ఆ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పడేలా చేసాడు పవన్. గత మూడు రోజులుగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తూ అనేక సమస్యల గురించి అడిగి తెలుసుకొని , వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. నిన్న సాయంత్రం పిఠాపురం లో సభ నిర్వహించి..తనను భారీ మెజార్టీ తో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also : Bharat Bandh : ఈరోజు దేశవ్యాప్తంగా మూతపడ్డ విద్యాసంస్థలు