Pawan Kalyan : పవన్ మాట ఇచ్చాడంటే..దేవుడు వరం ఇచ్చినట్లే
Pawan Kalyan : రాజకీయాల్లోకి వస్తే ఏ నేతయినా జేబులు నింపుకోవాలని , బ్యాంకు బాలన్స్ ఫిల్ చేసుకోవాలని , ఆస్తులు కూడబెట్టుకోవాలని చూస్తారు..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా తన జేబులో నుండి డబ్బులు పంచడమే కానీ నింపుకోవడం తెలియని వ్యక్తి
- By Sudheer Published Date - 09:27 AM, Thu - 10 October 24

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట ఇచ్చాడంటే..దేవుడు వరం ఇచ్చినట్లే అని మరోసారి రుజువైంది. ఎవరు ఆపదలో ఉన్న..కష్టాల్లో ఉన్న సామీ..అని తన వద్దకు వెళ్లిన..కష్టాల్లో ఉన్నారు అని తన దృష్టికి వెళ్లిన సరే ఏమాత్రం ఆలోచించకుండా తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు పవన్. ఇప్పటివరకు వందల కోట్లను ప్రజలకు దానం చేసాడు.. చేస్తూనే ఉన్నాడు. రాజకీయాల్లోకి వస్తే ఏ నేతయినా జేబులు నింపుకోవాలని , బ్యాంకు బాలన్స్ ఫిల్ చేసుకోవాలని , ఆస్తులు కూడబెట్టుకోవాలని చూస్తారు..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా తన జేబులో నుండి డబ్బులు పంచడమే కానీ నింపుకోవడం తెలియని వ్యక్తి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం అందించారు. అలాగే ఏపీలోని గ్రామాలకు కొంత విరాళం అందజేశారు. ఇక ఇప్పుడు రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె (Mysoora Vari Palli) లో పాఠశాలకు క్రీడామైదానం (School Ground) కోసం స్థలం కొనిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు రూ.60 లక్షల (60 Lakhs Donation) సొంత డబ్బుతో ఎకరం స్థలం కొనుగోలు చేసి మైసూరివారిపల్లె పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
ఆగస్టులో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సమయంలో మైసూరవారిపల్లి గ్రామ సభలో స్వయంగా పాల్గొన్నాను. ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం లేదు అని, భూమి కేటాయించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వినతిపత్రం ఇచ్చారు. కానీ మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు. దీంతో పవన్ తన సొంత డబ్బులు రూ.60 లక్షలు ఖర్చు పెట్టి స్థలం కొని , పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ చేయించిన డాక్యుమెంట్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్‌కలెక్టర్ నిధియాదేవి సమక్షంలో మైసూరివారిపల్లె సర్పంచ్ సంయుక్తకు అందజేశారు. దీంతో, ఆ గ్రామంలో వెంటనే క్రీడా మైదానంకు అవసరమైన విధంగా తీర్చి దిద్దాలని అధికారులకు పవన్ సూచించారు.
పవన్ రాజకీయాల్లోకి రాక ముందే ఎన్జీవోగా ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ పేరిట ఓ ట్రస్టు మొదలు పెట్టారు అవసరం ఉన్న చోట చదువుకునే విద్యార్ధులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఆ సంస్థ ఉద్దేశం. ఇప్పుడు పవన్ విరాళం ఇచ్చిన మైసూరా పల్లిలో ఆట స్థలం కోసం మిగిలిన మొత్తాన్ని ఇతర దాతల నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు. పవన్ సొంత నిధులతో చొరవ తీసుకోవటం పైన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Tata Group Next Generation: ఇప్పుడు ఇదే ప్రశ్న.. రతన్ టాటా వారసులు ఎవరూ..?