Pawan Kalyan : హోం మంత్రి అనితకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్..?
Pawan Kalyan : శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు
- Author : Sudheer
Date : 04-11-2024 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో వరుస అత్యాచారాలు (Rape Incident), క్రైమ్ ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం మారింది..ఆడ బిడ్డలకు రక్షణ ఉంటుందని అంత భావించారు. కానీ ప్రభుత్వం మారిన కామాంధులు మాత్రం మారడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తునప్పటికీ కామాంధులు మాత్రం వారి అరాచకాలను ఆపడం లేదు. కామంతో అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. యువకులే కాదు 60 , 70 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు కూడా అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. మరికొంతమంది స్నేహం ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో వైసీపీ (YCP) అధికార పార్టీ పై విమర్శలకు పెంచుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో పవన్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ..ఏమైపోయాయి ఆ మాటలు , ఆ వాగ్దానాలు..? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల హోం శాఖా (Home Department) కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిజాయతీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన ఆయన, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా, హోంమంత్రి అనిత శాంతిభద్రతల విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
‘నేను హోంమంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాదు, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. వరుస ఘటనలపై ఆవేదనతోనే ఆయన అన్నారా? లేక ఇతర కారణాలున్నాయా? అనేది మున్ముందు తెలియనుంది. కానీ రీల్ లైఫ్ గబ్బర్ సింగ్ రియల్ లైఫ్ హోం మినిస్టర్ అయితే? పరిస్థితి ఎలా ఉంటుంది? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
నేను హోమ్ శాఖా తీసుకుంటే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి 🔥🔥🔥@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/VwLdJSlPk9
— Prasannakumar Nalle (@PrasannaNalle) November 4, 2024
Read Also : Telangana Media Academy Chairman : శ్రీనివాస్ రెడ్డి ని సత్కరించిన కర్ణాటక రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్