Pandula Ravindra Babu : వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై..?
Pandula Ravindra Babu : వైసీపీ కి రాజీనామా చేసి జనసేన(Janasena)లో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చించారని వార్తలు వస్తున్నాయి
- Author : Sudheer
Date : 12-11-2024 - 11:08 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ (YCP) లో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున నేతలు రాజీనామాలు చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరి..పదవులు అందుకోగా.. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూడడంతో ఇక ఉన్న కొద్దీ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా అనేక మంది రాజీనామా చేయగా…తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతుంది.
ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు (Pandula Ravindra Babu) వైసీపీకి, అలాగే ఎమ్మెల్సీ (MLC Post) పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం తనను విస్మరించిందని ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ కి రాజీనామా చేసి జనసేన(Janasena)లో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడిన విషయం తెలిసిందే. మరి రవీంద్రబాబు అధికారికంగా వైసీపీ కి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది.
పండుల రవీంద్రబాబు అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 2014 లో టిడిపి నుండి గెలుపొందాడు. అంతకు ముందు ఈయన.. ఇండియన్ రెవెన్యూ సర్వీసులో అధికారిగా పనిచేసేవాడు. ఆ ఉద్యోగానికి 2014లో రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి గెలుపొందాడు. ఆ తర్వాత వైసీపీలో చేరడంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పండులకు 2020లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలా ఆయన నాలుగేళ్ళ పాటు పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నారు. ఇక మరో రెండేళ్ళ పదవీ కాలం ఉండగానే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు.
Read Also : Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో.. టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు మీటింగ్..