Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ముందు ఓవరాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది..!!
మంగళగిరి ఆఫీసులో సీఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు. పవన్ కల్యాణ్ ఆఫీసులో ఉన్న సమయంలో పర్మిషన్ లేకుండా లోనికి వెళ్లేందుకు ట్రై చేసాడు
- By Sudheer Published Date - 01:24 PM, Thu - 27 June 24

ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఓ తిక్క ఉంది..తన ముందు ఎవరు ఓవరాక్షన్ చేసిన అతడ్ని దరిదాపుల్లో కూడా కనిపించకుండా చేస్తాడు. ఇది చిత్రసీమలోనైనా..రాజకీయాల్లోనైనా..రీసెంట్ గా వైసీపీ అధినేత జగన్ తో పాటు గల్లీ లో తిరిగే చోట నాయకుడి వరకు బాగా తెలిసింది. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఓ CI కి కూడా ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ ముందే ఓవరాక్షన్ చేసాడు..తెల్లారేలోపు బదిలీ అయ్యి ఎక్కడికో వెళ్ళాడు.
We’re now on WhatsApp. Click to Join.
మంత్రిగా బాధ్యత తీసుకున్న దగ్గరి నుండి పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం..అది కూడా కీలక శాఖలకు బాధ్యత వహిస్తుండడం తో ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రతి దానిపై లోతుగా అలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే ప్రజల సమస్యల ఫై సమీక్షలు జరుపుతున్నారు. ఇలాంటి ఈ సమయంలో మంగళగిరి ఆఫీసులో సీఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు. పవన్ కల్యాణ్ ఆఫీసులో ఉన్న సమయంలో పర్మిషన్ లేకుండా లోనికి వెళ్లేందుకు ట్రై చేసాడు. మంత్రిగారు వారాహి దీక్షలో ఉన్నారు..కాసేపు ఆగండి అని సిబ్బంది సీఐకి తెలిపారు. అయినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐ పవన్ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ విషయం పవన్ కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సీఐ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్ కుమార్ ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వేశ్రేష్ట త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఇదే శ్రీనివాసరావు గతంలో అన్యాయంగా జనసేన కార్యకర్తలపై పలు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తుంది. ఇక సమయం చూసిన పవన్..తన తిక్క ఏంటో చూపించారు.
Read Also : Kalki : కల్కి మేనియా లో పవన్ కళ్యాణ్ తనయుడు