Lokesh : రోడ్డు వెయ్యండి అంటూ గ్రామస్థుల అభ్యర్థనను అర్ధం చేసుకున్న లోకేష్
Lokesh : ‘‘వెల్వడంలోని ప్రధాన రహదారి దుస్థితి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించి గ్రావెల్ మాత్రమే వదిలేయడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు
- By Sudheer Published Date - 02:05 PM, Wed - 2 July 25

వెల్వడంలో ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. తారు రోడ్డును తొలగించి నాలుగు నెలలుగా గ్రావెల్‌తో వదిలేశారని వారు ఆరోపించారు. దీని కారణంగా విద్యార్థులు, కూలీలు, ప్రయాణికులు ఎంతో బాధపడుతున్నారని, అనారోగ్య సమస్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యలతో కూడిన ఈ పరిస్థితిని వెంటనే పరిష్కరించాలని మంత్రి లోకేష్‌ను కోరారు.
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
ఈ విషయం పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రజలకు కలిగిన అసౌకర్యం పట్ల హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పారు. ‘‘వెల్వడంలోని ప్రధాన రహదారి దుస్థితి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించి గ్రావెల్ మాత్రమే వదిలేయడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు’’ అని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇందుకు పరిష్కారం కోసం తాను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు సంబంధిత అధికారులతో కలిసి సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా రోడ్డును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని లోకేష్ తెలిపారు.
I sincerely apologise for the inconvenience caused to the people of Velvadam due to the poor condition of the main road. I’m aware that the tar road was removed four months ago and left with gravel, affecting students, workers, and daily commuters. I will coordinate with the… https://t.co/pESQJxEFZm
— Lokesh Nara (@naralokesh) July 1, 2025