Nara Lokesh CID Inquiry : రెండో రోజు కూడా లోకేష్ ఫై CID ప్రశ్నల వర్షం
నిన్న మంగళవారం దాదాపు ఆరు గంటల పాటు లోకేష్ ను ప్రశ్నించారు అధికారులు. దాదాపు 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం
- Author : Sudheer
Date : 11-10-2023 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road Case)లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) రెండో రోజూ (2nd day CID Inquiry) సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయానికి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకోగా..ఆ తర్వాత విచారణ మొదలుపెట్టిన అధికారులు వరుస ప్రశ్నలు వేస్తున్నారు. నిన్న మంగళవారం దాదాపు ఆరు గంటల పాటు లోకేష్ (Nara Lokesh CID Inquiry) ను ప్రశ్నించారు అధికారులు. దాదాపు 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో హెరిటేజ్ సంస్థలకు లబ్ధిచేకూరేలావ్యవహరిచాడని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చాలని సీఆర్డీఏపై ఒత్తిడి తెచ్చారనే విషయాలపై లోకేష్ కు ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే, నారా లోకేష్ విచారణకు సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నమాట.. చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చిన ఈరోజు మరోసారి లోకేష్ ను విచారిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నిన్న సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. 50 ప్రశ్నల్లో 49 ప్రశ్నలు రింగ్‌రోడ్డుతో లింక్ లేని ప్రశ్నలే అన్నారు.. వాటికి గూగుల్‌లో వెతికినా జవాబులు తెలుస్తాయని సెటైర్లు వేశారు.. అయినా.. సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.. 2017లో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు నా ముందు పెడితే వాటికి సమాధానమిస్తానని చెప్పాను.. అందుకు సంబంధించిన ఆధారాలేవీ వారు చూపించలేదన్నారు.
Read Also : Most Expensive Player : ఖరీదైన కబడ్డీ ప్లేయర్ గా పవన్.. ‘తెలుగు టైటాన్స్’ టీమ్ లోకి ఎంట్రీ