Nagababu : జగన్ కు అసలైన ‘యుద్ధం ఇద్దాం’ అంటూ నాగబాబు పిలుపు
- Author : Sudheer
Date : 09-03-2024 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
సిద్ధం (Siddham)..సిద్ధం (Siddham) అంటున్న జగన్ (Jagan) కు అసలైన యుద్ధం ఇద్దాం అన్నారు మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు (Nagababu). గత కొద్దీ రోజులుగా బిజెపి తో పొత్తు కలుపుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఎట్టకేలకు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలో జరగబోయే లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన తో కలిసి పోటీ చేయబోతున్నట్లు బిజెపి అధిష్టానం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన తో ఇరు పార్టీల్లో సంబరాలు మొదలయ్యాయి. 2014 విజయం రిపీట్ కాబోతుందని అప్పుడే లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో నాగబాబు పొత్తు ఫై స్పందించారు. ఆలోచించాల్సిన సమయం కాదిది, నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయమంటూ అయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. విమర్శ, విభేదాల సమయం కాదిది, విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయమంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్, తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్..అంటూ వారికి గుర్తుచేశారు. నిర్లక్ష్యం వీడు, నిజాన్ని చూడు, నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు… సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం… అంటూ నాగబాబు క్యాడర్ ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసారు. మరి నాగబాబు పిలుపు జనసేన సైనికులు జోష్ పెంచుకుంటారో..ఇప్పటికే టీడీపీ తో పొట్టుకొని నష్టపోయాం..ఇప్పుడు బిజెపి తో కూడానా అని జోష్ తగ్గించుకుంటారో చూడాలి.
ఆలోచించాల్సిన సమయం కాదిది,
నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయం,సందిగ్ధాల సమయం కాదిది,
సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం,విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం..
శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్,
తీర్చుకోవాల్సిన పగా… pic.twitter.com/jMipvgnVMT— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2024
Read Also : BJP Alliance : బిజెపితో పొత్తు..పార్టీని వీడేందుకు పలువురు టీడీపీ నేతలు ..