Note For Vote Case : ‘ఓటుకు నోటు’ కేసులో కదలిక.. 4న సుప్రీంకోర్టులో విచారణ
Note For Vote Case : ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అక్టోబర్ 4న విచారణ జరుగనుంది.
- By Pasha Published Date - 10:26 AM, Sun - 1 October 23

Note For Vote Case : ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అక్టోబర్ 4న విచారణ జరుగనుంది. ఓటుకు నోటు కేసుపై 2017 లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేసిన రెండు పిటిషన్లు.. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు విచారణకు రానున్నాయి. ఈ 2 పిటిషన్లలో ఒకటి.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరేది. మరొకటి.. ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ నుంచి ఏపీ ఏసీబీకి బదిలీ చేయాలని కోరేది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను ఈనెల 4న విచారించనుంది. ఆరోజున కోర్టు నంబర్ 16లో ఐటెమ్ 109గా ఓటుకు నోటు కేసుపై విచారణ జరుగనుంది. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో చంద్రబాబు వేసిన ఒక పిటిషన్ పై సుప్రీంలో అక్టోబర్ 3న విచారణ జరగనుంది.
Also read : Hyper Aadi : ఏ హీరోని వదిలిపెట్టని హైపర్ ఆది.. ఎన్టీఆర్ నుంచి కిరణ్ వరకు సెన్సేషనల్ కామెంట్స్..!
ఓటుకు నోటు కేసు అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆనాడు బాగా వైరల్ అయింది. ఈ కేసులో ఆనాడు రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి చంద్రబాబు డబ్బులు ఇచ్చారనేది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అభియోగం. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు.