Rains : నడుము లోతు నీళ్లల్లో..ప్రజల బాగోగులు అడిగితెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు
- By Sudheer Published Date - 01:04 PM, Sat - 31 August 24

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వర్షాలు దంచికొడుతుండడం తో అనేక జిల్లాలు వరదమయంగా మారిపోయాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు (CHandrababu) అధికారులను , ఎమ్మెల్యేలను అలర్ట్ చేసారు. పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షించారు. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలని , పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలన్నారు. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టిపెట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాలిక మృతి చెందింది. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అని అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడలోని వన్ టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్‌ఆర్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వరద ముంపునకు గురైన ప్రాంతాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పర్యటిస్తూ ప్రజల బాగోగులు అడిగితెలుసుకున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో, నడుము లోతు నీళ్లల్లో ఎమ్మెల్యే, భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. సహాయక చర్యలు చేపడుతూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్న అధికార యంత్రాంగం#AndhraPradesh pic.twitter.com/dTDDIOHDEh
— Telugu Desam Party (@JaiTDP) August 31, 2024
Read Also : Safety Rating Stickers: కార్ల భద్రతా కోసం రేటింగ్ స్టిక్కర్లు.. ఇది ఎలా పని చేస్తుందంటే..?