Roja Vs Chandrababu : చంద్రబాబు పై ట్విట్టర్ యుద్ధానికి దిగిన రోజా
ఇంతకాలం పాటు మీడియా వేదికగా చంద్రబాబు మీద చెలరేగిపోయిన మంత్రి రోజా ఇప్పుడు ట్వీట్టర్ వేదికపైకి వచ్చారు.
- Author : CS Rao
Date : 26-09-2022 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంతకాలం పాటు మీడియా వేదికగా చంద్రబాబు మీద చెలరేగిపోయిన మంత్రి రోజా ఇప్పుడు ట్వీట్టర్ వేదికపైకి వచ్చారు. టీడీపీ చీఫ్ మీద విరుచుకుపడుతూ కుప్పంలో ఓటు లేకుండా ఉన్న చంద్రబాబునాయుడ్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఆయన వయసు, అనుభవంకు పోల్చుతూ ఓటు గురించి చీల్చి చెండారు.
`వయసు 73, అనుభవం 45, సీఎంగా 14, కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే స్కీము లేదు! వాటే పిటీ బాబూ…?“ అని రోజా ట్వీట్ ను వదిలారు. ఏళ్ల తరబడి కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు ఓటు హక్కుతో పాటు కుప్పంలో సొంతిల్లు కూడా లేని వైనాన్ని ఆమె గుర్తు చేశారు.
వయసు 73. అనుభవం 45. సీఎంగా 14. కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే స్కీము లేదు! వాటే పిటీ బాబూ…?#Chandrababu
Tᴀʀɢᴇᴛ 175 🎯🔥#KuppamGaddaYSRCPAdda 💪@YSRCParty @YSRCPDMO pic.twitter.com/4IFnbIpi1w— Roja Selvamani (@RojaSelvamaniRK) September 26, 2022
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోమవారం సోషల్ మీడియా వేదికగా బాబుపై విమర్శలు గుప్పించారు. ఆయనకు కుప్పంలో ఓటు హక్కే లేని విషయాన్ని ప్రస్తావిస్తూ రోజా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా లేదని ఆమె పేర్కొన్నారు.