Mining Mafia : ఉత్తరాంధ్రపై మైనింగ్ మాఫియా! రూ. 12లక్షల కోట్ల సంపదపై కన్ను!
మైనింగ్ మాఫియా(Mining Mafia)ఉత్తరాంధ్ర మీద పడింది. సుమారు 12లక్షలకోట్ల సంపదను
- By CS Rao Published Date - 01:48 PM, Thu - 16 February 23

మైనింగ్ మాఫియా(Mining Mafia) ఉత్తరాంధ్ర మీద పడింది. సుమారు 12లక్షల కోట్ల విలువైన సంపదను దోచుకోవడానికి సిద్ధమయింది. లేట్ రైట్ అనుమతులు తీసుకుని బాక్సైట్ (Bauxite)తవ్వకుంటూ ప్రకృతిని అమ్మేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలపై పలు రకాలు ఆందోళనలు కొనసాగినప్పటికీ తవ్వకాలకు పరోక్షంగా లైన్ క్లియర్ చేస్తూ వేల కోట్ల రూపాయల దోపిడీకి ఏపీ సర్కార్ మార్గం సుగమమం చేస్తోందన్న ఆరోపణ ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు, గిరిజనులు, మన్యంవీరులు ఆందోళన బాట పడుతున్నారు. మావోయిస్టులు ఇప్పటికే ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకాడని మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున ప్రజా సంపదను దోచుకోవడానికి రంగం సిద్ధం చేసింది.
మైనింగ్ మాఫియా ఉత్తరాంధ్ర మీద(Mining Mafia)
రాయలసీమ ప్రాంతాల్లోని మైనింగ్ మాఫియా(Mining Mafia) ఇప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చేసింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓబులాపురం మైనింగ్ పెద్ద దుమారాన్ని రేపింది. ఆ కేసులో ఐఏఎస్ లు, మంత్రులు జైలు పాలయ్యారు. మైనింగ్ కింగ్ గా ఉన్న గాలి జనార్థన్ రెడ్డి జైలు ఊచలు లెక్కపెట్టారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది. సేమ్ టూ సేమ్ ఓబులాపురం తరహాలోనే బాక్సైట్(Bauxite) వ్యవహారం ఉత్తరాంధ్ర కేంద్రంగా తెరమీదకు వస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు పరోక్ష అనుమతి నుంచి ఎగుమతుల వరకు పలు అక్రమాలకు తావిస్తుందని ప్రజా ఆందోళన మొదలయింది.
మైనింగ్ కింగ్ గా ఉన్న గాలి జనార్థన్ రెడ్డి జైలు
విశాఖ, తూర్పు గోదావరి సరిహద్దు ఏజెన్సీల్లో బాక్సైట్ ఖనజం (Bauxite)విస్తారంగా ఉంది. గత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో వివాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు ఇద్దరు ప్రజాప్రతినిధులను కోల్పోయింది. మావోయిస్టులు వాళ్లను కాల్చి చంపారు. ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపు బాక్సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు రద్దు చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ కేవలం ఆనాడు చంద్రబాబు ఇచ్చిన కంపెనీకి ఉన్న అనుమతులు మాత్రమే రద్దయ్యాయి. ఎందుకంటే బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వడం రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది.
లేట్ రూట్ , బాక్సైట్ మధ్య స్వల్ప వ్యత్యాసం(Bauxite)
వాస్తవంగా లేట్ రూట్ , బాక్సైట్ (Bauxite)మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. దాన్ని ఆసరగా చేసుకుని లేట్ రైట్ పేరుతో బాక్సైట్ ను పెద్ద ఎత్తున అధికార పార్టీకి చెందిన పెద్దలు కొందరు తవ్వేస్తున్నారు. ముడి పదార్థంలో ఉండే అల్యూమినియం ఖనిజం పరిమాణాన్ని బట్టి లేట్ రైట్ లేదా బాక్సైట్ అనేదాన్ని నిర్థారిస్తారు. ప్రాథమిక స్థాయిలో ఈ వ్యత్యాసాన్ని నిర్ణయించే వ్యవస్థ లేకపోవడంతో బాక్సైట్ తవ్వకాలు యధేచ్చగా జరిగిపోతున్నాయని సర్వత్రా ఏజెన్సీల్లో వినిపించే మాట. అధికారికంగా కంపెనీలకు బాక్సైట్ తవ్వకాల అనుమతులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ రద్దు చేసినప్పటికీ అనధికారికంగా ప్రభుత్వ పెద్దలు (Mining Mafia)బాహాటంగా తవ్వకాలు జరుపుతున్నారని గిరిజన సంఘం నాయకులను ఎవరిని కదిలించినా చెబుతారు.
అనధికారికంగా లేటరైట్ పేరుతో బాక్సైట్ ను తవ్వేస్తూ..
గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో దుబాయ్ కి చెందిన అన్ రాక్ కంపెనీ మాకవరపాలెంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని నిర్మించింది. బాక్సైటే ముడిఖనిజం, బాక్సైట్(Bauxite) తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ఆ సమయంలోనే ఈ కంపెనీ రూ. 720 కోట్లతో ఈ ఫ్యాక్టరీని నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చిన అనుమతులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అంటే బాక్సైట్ తవ్వకాల రద్దు అనేది పూర్తిగా జరగలేదు. అనధికారికంగా లేటరైట్ పేరుతో బాక్సైట్ ను తవ్వేస్తూ సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు.
Also Read : Supreme Jagan : ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి కేసు హవా!`బెంచ్`హంటింగ్ దుమారం!!
విశాఖ జిల్లా నాతవరం మండలంలోని బమిడికలుద్ది నుంచి తూర్పు గోదారి జిల్లాలోని రౌతులపూడి వరకు ఉన్న ఏజెన్నీ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు వేశారు. దాన్ని కేవలం బాక్సైట్ రవాణ కోసం ప్రైవేటుగా వేసిన రోడ్డుగా స్థానిక గిరిజనులు చెబుతున్నారు. విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ సరిహద్దులో ఉన్న సరుగుడు పంచాయితీలో లేటరైట్ ఖనిజం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని 2010లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 2004లో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ చేసిన సర్వేలలో నిర్థారణ అయింది. ప్రస్తుతం నాతవరం మండలంలో ఉన్న 16 గ్రామాల్లో లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు గిరిజనులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ప్రభుత్వ పెద్దలు చీకటి సామ్రాజ్యాన్ని…
లేటరైట్ ముసుగులో బాక్సైట్ (Bauxite) తరలిస్తున్నారని ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఎన్జీటీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.తవ్వకాలు ఆపాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినా తవ్వకాలు ఆగడంలేదు. ఓబులాపురం గనుల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ, గనులశాఖ అధికారులు ఏకమయ్యారు. ఆ విషయాన్ని సీబీఐ నిర్థారించింది. ఇప్పుడు అదే తరహాలో బాక్సైట్ విషయంలోనూ ఏకమైన దోచుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు మైనింగ్ చేస్తూ చీకటి సామ్రాజ్యాన్ని ప్రభుత్వ పెద్దలు(Mining Mafia) ఏలుతున్నారు. ఆండ్రూ మినరల్స్ అనే కంపెనీకి 2013లో తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఆ కంపెనీ చేపట్టిన ఖనిజ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలియచేసిన విఫయాన్ని విపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నాయి.
అన్ రాక్ కంపెనీతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా జగన్మోహన్
లేట రైట్ కు అనుమతులు పొందిన ఆండ్రూ మినరల్స్ కంపెనీ ఒడిసాలోని వేదాంత అల్యూమినియం కంపెనీకి 32 లక్షల మెట్రిక్ టన్నుల ముడి ఖనిజాన్ని సరఫరా చేసింది. అల్యూమినియం కంపెనీకి సరఫరా చేసిందంటే అది బాక్సైట్ గా అనుమానిస్తున్నారు. అలాగే, 4.6 లక్షల మెట్రిక్ టన్నులను చైనాకు ఎగుమతి చేశారని, దీనిపైనా విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, లెక్కల్లో చూపించని మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజ తవ్వకాలు జరిగినట్లు కూడా విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. అన్ రాక్ కంపెనీతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా జగన్మోహన్ సర్కార్ కుస్తీ పడుతోంది. అవసరమైతే, అన్ రాక్ లోని రకియా వాటాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్దపడుతుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతోనూ అన్ రాక్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది.
Also Read : Jagan Twist : విశాఖే రాజధాని వెనుక MLC ఎన్నికల వ్యూహం! డైవర్షన్ పాలిట్రిక్స్ !
ఉత్తరాంధ్రలోని బాక్సై ట్ (Bauxite) వ్యవహారం 1970వ సంవత్సరంలో తొలిసారిగా తెరమీదకు వచ్చింది. ఏపీ, ఒరిస్సా రాష్ట్రాల్లో ఖనిజం ఉందని అప్పట్లో గుర్తించారు. ఏపీలోని విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అపార ఖనిజ సంపద ఉందని గుర్తించారు. ఒరిస్సా 1980వ సంవత్సరం నాల్కోతో ఒప్పందాలు చేసుకుంది. కానీ, ఏపీ మాత్రం రష్యా సాంకతిక పరిజ్ఞానం, పవర్ ను పరిశీలించిన తరువాత అనుమతులు ఇవ్వలేదు. కానీ, తొలిసారిగా 2004వ సంవత్సరం రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కంపెనీ జిందాల్ తో బాక్సైట్ ఒప్పందం కుదిరింది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రముఖులకు వాటాలున్న దుబాయ్ కి చెందిన రసాల్ ఖైమాకు బాక్సైట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతించారు. ఈ రెండు కంపెనీలకు ఒప్పందం ప్రకారం ఏపీఎండీసీ ముడిసరకును అందిస్తుంది. అంటే, మైనింగ్ అంతా ఏపీఎండీసీ చేసి ఇస్తే, అల్యూమినయం రిఫైనరీ వరకు జిందాల్, రసాల్ ఖైమా పరిమితం అవుతాయి. కేవలం 360 మంది మాత్రమే ఉద్యోగులున్న ఎపీఎండీసీ మైనింగ్ చేస్తుందంటే ఎవరైనా నమ్మగలరా? అంటే అనధికారికంగా తవ్వకాలు ఆ రెండు కంపెనీ చేస్తాయన్నమాట.
ప్రభుత్వ పెద్దలు చేస్తోన్న బాక్సైట్ కుంభకోణాన్ని..(Bauxite)
బాక్సైట్ (Bauxite) తవ్వకాల కారణంగా ఉత్తరాంధ్రలోని నాగావళితో సహా 19 నదులు, వాటి మీద నిర్మించిన సాగు, తాగు నీటి ప్రాజెక్టులు కలుషితం అవుతాయని వాతావరణవేత్తల అంచనా. మైనింగ్ ఒప్పందం ప్రకారం కనీసం 17 నుంచి 30 ఏళ్ల వరకు జరుగుతుంది. అంటే, ఏ స్థాయిలో శబ్ద, వాయు, భూ కాలుష్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మన్యం ప్రాంతాల్లోని గిరిజనుల నుంచి భూములను ఇప్పటికే లక్ష నుంచి 2 లక్షల లోపు ధరకు ప్రభుత్వంలోని పెద్దలు బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారని టాక్. వాటికి జిందాల్ కంపెనీ నష్టపరిహారం కింద రూ. 20లక్షల నుంచి రూ. 25లక్షల వరకు చెల్లిస్తోంది. అంటే, ఏ స్థాయి అవినీతి జరిగిందో అంచనా వేసుకోవచ్చు. ఇలా ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు అండ్ టీమ్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన కుమారుడు కేసుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేస్తోన్న బాక్సైట్ కుంభకోణాన్ని టీడీపీ పూసగుచ్చినట్టు చెబుతోంది. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ పరస్సరం బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆరోపించుకుంటూ సమాజ సంపద కొల్లగొడుతున్నారు.