Kurnool YCP Candidate : కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా
- Author : Sudheer
Date : 22-02-2024 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
కర్నూలు (Kurnool ) వైసీపీ టికెట్ (YCP Candidate) ఎవరికీ ఇస్తారనే ఆసక్తి తెరపడింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా (Ilyaz Basha) దాదాపు ఖరారైనట్లే. రేపు లేదా ఎల్లుండి ఈ వార్త ను అధికారికంగా ప్రకటించనుంది అధిష్టానం. ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని వైసీపీ మారుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు కాకుండా.. ఇలియాజ్ బాషాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంచుకోవాలనే చర్చ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో తాడేపల్లి గూడెంలో కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయమై చర్చలు జరిపారు. చివరకు హఫీజ్ ఖాన్ ను సర్దిచెప్పి..ఇలియాజ్ బాషా కు సపోర్ట్ చేయాలనీ అధిష్టానం కోరింది. పార్టీ లో హఫీజ్ ఖాన్‌కు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నారు. వైసీపీ విడుదల చేయబోయే 8వ లిస్టులో కచ్చితంగా ఇలియాజ్ బాషా పేరు ఉంటుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల గెలుపొందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గెలిచివారికే సీట్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికే 7 విడతల్లో పార్టీ ఇంచార్జులను ప్రకటించారు. ప్రస్తుతం 8 విడత ఇంచార్జులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : Ruhani Sharma : గ్లామర్ లో హిట్టు అనేలా చేస్తున్న అమ్మడు..!