Kodali challenges Pawan: పవన్ కు కొడాలి నాని ఛాలెంజ్!
ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ప్రచారానికి తెరలేపిన విషయం తెలిసిందే.
- Author : Balu J
Date : 19-07-2022 - 11:49 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ప్రచారానికి తెరలేపిన విషయం తెలిసిందే. పవన్ తలపెట్టిన కార్యక్రమాన్ని జనసైనికులు ముందుకు తీసుకెళ్తుండగా, మాజీ మంత్రి కొడాలి నాని పవన్ పై విరుచుకుపడ్డారు. 10% రోడ్లు లేని రాష్ట్రాన్ని చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమని నాని జనసేన పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. తాను విసిరిన ఛాలెంజ్ నిజమని నిరూపిస్తే.. జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారని, లేని పక్షంలో పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని నాని హెచ్చరించారు.
దేశంలో 20% గుంతల రోడ్లు ఉండటం సర్వసాధారణమన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసినా ఏటా రోడ్లు పాడవుతున్నాయి. తిరిగి శాసనసభకు రానని చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞను భగ్నం చేశారని కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ అధినేత సోమవారం ఇక్కడ అసెంబ్లీని సందర్శించి రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబు తన ప్రతిజ్ఞపై నిలవకపోవడంతో విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు.