Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై రాళ్ల దాడి
మాజీమంత్రి జోగిరమేశ్ ఇంటిపై దాడి చేసింది టీడీపీ, జనసేన వాళ్లేనని వైసీపీ ఆరోపిస్తోంది
- Author : Sudheer
Date : 16-06-2024 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు చోట్ల వైసీపీ నేతలపై , శ్రేణులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం లో అధికారం అడ్డుపెట్టుకొని ,టిడిపి నేతలపై దాడులు జరుపుగా..ఇప్పుడు ప్రతీకారంగా టిడిపి శ్రేణులు సైతం దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే పలువురి ఫై దాడులు జరుగగా..తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఇంటిపై గుర్తుతెలియని దుండగులు రాళ్ల తో దాడి చేసారు. గుర్తు తెలియని వ్యక్తులు AP39KD3267 కారులో వచ్చినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
జోగి రమేశ్ ఇంటిముందే కారు ఆపి, తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీస్ కానిస్టేబుల్ పట్ల దుండగులు దురుసుగా ప్రవర్తించారు. జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మాజీమంత్రి జోగిరమేశ్ ఇంటిపై దాడి చేసింది టీడీపీ, జనసేన వాళ్లేనని వైసీపీ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జోగి రమేష్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లిన నేపథ్యంలో అందుకు ప్రతిగానే ఈదాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రాళ్ల దాడి చేసిన యువకులు వెంటనే అదే కారులో వెళ్లిపోయారు. ఫలితాల అనంతరం ఘర్షణలు జరుగుతాయన్న సమాచారంతో పాటు నిఘా వర్గాల సూచనల మేరకు కొందరు వైసీపీ నేతల ఇళ్లవద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ దాడులపై వైసీపీ నేతలు సైతం గవర్నర్ కు పిర్యాదులు చేయడం జరిగింది.
Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్