Jagan : పిఠాపురం ప్రజలకు కీలక హామీ ఇచ్చిన జగన్
పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక చేశారు. గెలిచినా ఓడినా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. కానీ, ఇక్కడ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది వంగా గీతనే అన్నారు.
- By Sudheer Published Date - 05:58 PM, Sat - 11 May 24

ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా చివరి రోజున జగన్..పిఠాపురం (Pithapuram)లో పర్యటించారు. పిఠాపురం బరిలో వైసీపీ తరుపున వంగా గీత (Vanga Geetha) బరిలోకి దిగగా ..జనసేన తరుపున పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల హోరు తారాస్థాయి లో ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను రెండు చోట్లా ఓడించిన వైసీపీ..ఈసారి కూడా పిఠాపురంలో ఓడించాలని చూస్తుంది. అందుకు తగ్గట్లే ఇక్కడ భారీగా నేతలను దింపి ప్రచారం చేస్తూ వస్తుంది. ఇక ఈరోజు పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొని కీలక హామీ ఇచ్చారు.
పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక చేశారు. గెలిచినా ఓడినా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. కానీ, ఇక్కడ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది వంగా గీతనే అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా..? అని ప్రశ్నించారు. ఐదేళ్లకొకసారి కార్లను మార్చినట్టే.. భార్యలను మార్చే ఈ దత్త పుత్రుడు ఎమ్మెల్యే అయితే కలిసే పరిస్థితి ఉంటుందా..? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడికి ఓటు వేస్తే.. పిఠాపురంలో ఉంటాడా..? అని అడుగుతున్నా. జలుబు చేస్తే.. హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం వచ్చింది. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే.. న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. నా తల్లి, అక్క లాంటి వంగ గీతను గెలిపించండి అని కోరారు. సాధ్యం కానీ హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించడని జగన్ పేర్కొన్నారు.
ఇక పిఠాపురం అభ్యర్థి వంగా గీత మాట్లాడుతూ.. పిఠాపురం తన సొంత కుటుంబం అని చెబుతూ వంగ గీత ఎమోషనల్ అయ్యారు. నేను ఇక్కడ పుట్టలేదని కొందరూ అవమానిస్తున్నారు. నా పుట్టుకు పిఠాపురానికి దగ్గర చేయకపోతే నా అంతియ యాత్ర ఇక్కడే జరగాలి. నా ఆడపడుచులు, అన్నదమ్ములు నాకు పుసుపు కుంకుమ పెట్టి పంపించాలి. మిమ్మల్ని చెంగుచాచి అడుగుతున్నా.. నాకు అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read Also : AP Polling Timings : ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ