AP CM Jagan : ఐపాక్ టీమ్ హెచ్చరికతో జగన్ జాగ్రత్తపడుతున్నాడా..?
- By Sudheer Published Date - 12:42 PM, Wed - 13 December 23

వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందా..? రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు..పదేళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలు అందజేసి..రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారో అని ముందే జగన్ జాగ్రత్తపడుతున్నారా..? ఐపాక్ టీమ్ కూడాvaమందిని మార్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటీకే ముందుగా 11 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చేశారు. రాబోయే రోజుల్లో అభ్యర్థులను మార్చడం..కొంతమందికి అసలు టికెట్ ఇవ్వకుండా ఉండడం చేయబోతున్నారట.
We’re now on WhatsApp. Click to Join.
శ్రీకాకుళం , విజయనగరం, విశాఖ , ఉమ్మడి గోదావరి , కృష్ణా, గుంటూరు , ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు , అనంతపూర్ , కడప , కర్నూల్ ఇలా పలు జిల్లాలో చాలావరకు నేతలను మార్చబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబదించిన కార్యాచరణ మొదలుపెట్టారట. ఈ విషయం తెలిసి అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైందట. వీరిలో కొంతమంది టికెట్ వస్తాడో రాదో అనుకునేవారు ముందే పార్టీని వీడాలని చూస్తున్నారట. జగన్ టికెట్ ఇస్తారో లేదో ఎదురుచూసే బదులు ఇప్పుడే వేరే పార్టీ లో చేరితే బెటర్ కదా అని ఆలోచిస్తూ..తమ కార్యవర్గం తో చర్చలు జరుపుతున్నారట. మరోవైపు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం జనవరి లోపు వైసీపీ లో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారని,
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయడంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు బాబోయ్ అంటే… మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైసీపీ మునిగిపోయే పడవని వారికి అర్థమైందని అన్నారు. ప్రజా తీర్పు అధికార వైసీపీ కి వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడ్డ పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల ఫలితాలతో జగన్ లో భయం మొదలైందని స్పష్టంగా అర్ధం అవుతుంది.
Read Also : Hyderabad: మహిళలకు వేధింపులు, 117 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్