YCP Leaders Arrest Issue : పవన్ ఇలా చేయడం న్యాయమా? – లక్ష్మి పార్వతి
YCP Leaders Arrest Issue : గతంలో నంది పురస్కారాల వివాదం (Nandi Awards Controversy)లో పోసాని కృష్ణమురళి (Posani Murali Krishna) చేసిన నిర్ణయం తప్పా? ఒకే వర్గానికి అవార్డులు ఇస్తున్నారని అప్పుడు పోసాని నిరసన వ్యక్తం చేయడం అన్యాయమా?
- By Sudheer Published Date - 04:03 PM, Sun - 2 March 25

YCP Leaders Arrest : వైసీపీ నేతల అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి (Laxmi Parvathi) తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో నంది పురస్కారాల వివాదం (Nandi Awards Controversy)లో పోసాని కృష్ణమురళి (Posani Murali Krishna) చేసిన నిర్ణయం తప్పా? ఒకే వర్గానికి అవార్డులు ఇస్తున్నారని అప్పుడు పోసాని నిరసన వ్యక్తం చేయడం అన్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, పౌర పురస్కారాలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
Web Series : ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే..!
అయితే, ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడమేంటని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. రాజకీయ కారణాలతో వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి లేదా పార్టీకే న్యాయం ఉండాలన్న విధానాన్ని ఆమె తప్పుపట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో తాను సహా ఎంతో మంది అన్యాయానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే విధంగా వైసీపీ నేతలకు జరుగుతున్నదని ఆమె అభిప్రాయపడ్డారు.
Samsung Phones : ‘శాంసంగ్’ మూడు కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవిగో
అలాగే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యవహార శైలిపై కూడా ఆమె ప్రశ్నించారు. కక్ష తీర్చుకునేందుకు ఇలా అరెస్టులు చేయడం సమంజసమా? అని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చట్టపరమైన వ్యవస్థలు సమానంగా వ్యవహరించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్థాల కోసం కక్షసాధింపు చర్యలు తీసుకోవడం సరైన విధానమా? అని ప్రశ్నించారు.