Pawan Kalyan : ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు..తేల్చి చెప్పేసిన పవన్
- By Sudheer Published Date - 04:14 PM, Thu - 14 March 24

గత పది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ బరితో పాటు లోక్ సభ (LOk Sabha) బరిలో కూడా పోటీ చేయబోతున్నాడని..బిజెపి కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చిందని..అందుకే ఒకవేళ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఎంపీ(Pawan Kalyan MP)గా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టొచ్చు అనే ఆలోచన లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అనేక కథనాలు వినిపించాయి. ఈ కథనాలను నమ్మి చాలామంది పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు , సలహాలు ఇవ్వడం చేయడం చేసారు. కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఏమాత్రం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. అంతే కాదు పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దీంతో సుదీర్ఘ ఉత్కంఠకు తెర పడినట్లు అయ్యింది. కాగా, 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ప్రస్తుతం పిఠాపురం స్థానంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. వంగా గీత, ముద్రగడ పద్మనాభం పేర్లను అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో సీఎం జగన్ నిర్ణయం వెలువరించలేదు. ఇక, ఈ స్థానంపై ఆయన త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అన్ని మతాల వారిని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. ముస్లింలను మైనార్టీలు అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మైనార్టీలు నా గుండెల్లో ఎప్పుడూ మెజార్టీలే. క్రిస్టియన్లను ఎప్పుడూ ఓట్లు అడగలేదు. మనస్ఫూర్తిగా గౌరవించాను. నా భార్య కూడా క్రిస్టియనే. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడట్లేదు. అన్ని మతాలు నాకు సమానమే అని చెప్పుకొచ్చారు.
అలాగే వైసీపీ , సీఎం జగన్ ఫై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదంటూనే పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు . నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చా. అన్యాయాన్ని ఎదిరించేందుకే వచ్చా. కానీ ఓడిపోయినప్పుడు శూన్యం అనిపించింది. ప్రజల కష్టాలు నావే అనుకుని బతికేస్తున్నా అంటూ తెలిపారు. ఇక రాజకీయ సభల్లో గ్రాఫిక్స్ వాడటం వైసీపీకి అలవాటేనని ఈ సందర్బంగా సెటైర్లు చేసారు. గ్రాఫిక్స్ ఫై ఆధారపడి వైసీపీ మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ‘అప్పులు చేసి అభివృద్ధి చేస్తే శ్రీలంక పరిస్థితే ఎదురవుతుంది. తగ్గే కొద్ది మనమే ఎదుగుతాం. ప్రజలను ఏడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు.
Read Also : MP Preneet Kaur: కాంగ్రెస్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ